దర్శకుల మీద నమ్మకమే మహేష్ బాబు బలము- బలహీనత

Mahesh Babu Trusts his Directors,Latest Telugu Movies,Telugu Filmnagar,Telugu Movie Updates,Tollywood Latest News,Birthday Wishes To Superstar Mahesh Babu,Super Star Mahesh Babu Trusts His Directors,Mahesh Babu Birthday Celebrations,Surprise Treat to Fans on Mahesh Babu Birthday,Mahesh Babu Birthday Story
Mahesh Babu Trusts his Directors

“ద మోస్ట్ డిజైర్డ్ మాన్ ఆఫ్ ఇండియా “గా,”ఫోర్బ్స్ ఇండియా సెలెబ్రిటీ హండ్రెడ్స్”లిస్ట్ లో    పలుమార్లు ఎంపిక కాబడిన “ప్రైడ్ ఆఫ్ టాలీవుడ్” మహేష్ బాబు జన్మదిన సందర్భంగా ‘ద తెలుగు ఫిల్మ్ నగర్ డాట్ కామ్’ ప్రత్యేక వ్యాసం .

చైల్డ్ ఆర్టిస్ట్ గానే స్టార్ డమ్ సాధించి హీరోగా ఎదిగాక ఆ స్టార్ డమ్ ను శిఖరాగ్ర స్థాయిలో నిలబెట్టుకున్న ఒకే  ‘ఒక్కడు ‘ మహేష్ బాబు అన్నది జగమెరిగిన సత్యం. నిజానికి చైల్డ్ హీరోగా మహేష్ బాబు కనబరిచిన స్పార్క్ అండ్ డైనమిజాలను చూసి ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేవారు.  ఇతనికి ఇంత చిన్న వయసులో ఇంత మెచ్యూరిటీ ఎలా వచిందబ్బా అని సెట్స్ మీదనే నోరెళ్ళబెట్టి చూసేవాళ్ళు యూనిట్ మెంబర్స్.  1979 లో దర్శకరత్న   దాసరి నారాయణరావు దర్శకత్వంలో కేవలం నాలుగేళ్ళ చిరుప్రాయంలో   తొలిసారిగా ‘నీడ’చిత్రానికి గాను కెమెరాను ఫేస్ చేసినప్పటి  ముహూర్త బలం ఎంత బలమైనదో గానీ మహేష్ బాబు లో కెమెరా ఫియర్ అన్నది ఎప్పుడూ ఎవరూ చూసి ఉండలేదు. నీడ తరువాత నాలుగేళ్ళ గ్యాప్ తీసుకొని 1983 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో  ‘పోరాటం ‘ చిత్రం తో మరలా కెమెరా ముందుకు వచ్చారు మహేష్ బాబు.

చైల్డ్ ఆర్టిస్టుగా మహేష్ బాబు తొలి చిత్ర దర్శకుడు దాసరి నారాయణరావు అయితే రెండవ చిత్ర దర్శకుడు ఆయన శిష్యుడు కోడి రామకృష్ణ కావటం ఒక యాదృచ్చిక విశేషం . అలా పోరాటంతో చైల్డ్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు శంఖారావం, ముగ్గురు కొడుకులు ,కొడుకుదిద్దిన కాపురం ,అన్నతమ్ముడు,గూఢచారి117,బాలచంద్రుడు ,బజార్ రౌడీ  చిత్రాలలో నటించి “సూపర్ స్టార్ ” కృష్ణ  వారసుడిగా రాబోయే, కాబోయే “సూపర్ స్టార్ ” నేనే అనే బలమైన సంకేతాలను వదిలి చదువుకోసం మరో గ్యాప్ తీసుకున్నారు.

‌ఇక 1999లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అగ్ర నిర్మాత అశ్వనీదత్ నిర్మించిన ‘రాజకుమారుడు’ తో హీరోగా ప్రారంభమైన మహేష్ బాబు కేరీర్ ప్రభంజన విజయాలతో దూసుకుపోతూ సూపర్ స్టార్ వారసత్వాన్ని గొప్పగా కొనసాగిస్తున్నారు. 1999 నుండి 2018 మధ్య కాలంలో 24 చిత్రాలలో నటించిన మహేశ్ బాబు అద్భుత విజయాల ద్వారా ఎంత క్రేజ్ సంపాదించారో  తన అరుదైన వ్యక్తిత్వం ద్వారా అంత స్థాన విశిష్టతను సంపాదించుకున్నారు .

తన ఈ 19 ఏళ్ల-24 సినిమాల ప్రస్థానంలో అఖండ విజయాలు ఉన్నాయి…అనూహ్య పరాజయాలు ఉన్నాయి. అయితే జయాపజయాలను ఒక సమతుల్య స్థితిలో స్వీకరించే మానసిక పరిపక్వతను అలవరచుకున్నారు మహేష్ బాబు .
‌ఒక  దర్శకుడిని   ఒకసారి నమ్మి మాట ఇస్తే ఇక ఆ దర్శకుడు ఏం చెప్పినా ఏం చేసినా పూర్తి విధేయతతో పని చేయడం మహేష్ బాబు కమిటెడ్ నేచర్ కు నిదర్శనం. ఇదే మహేష్ బాబు బలమూ-బలహీనత కూడా. ఆ బలం తనకు అద్భుత విజయాలను అందిస్తే …ఆ బలహీనత కొన్ని ఘోర పరాజయాలను అందించింది. ఒకసారి కమిట్ అయిన తరువాత ‘ఇదేంటి …అదేంటి ‘అని ప్రశ్నిస్తే దాన్ని ఇంటర్ఫియర్ అంటారు…అలాగని పట్టించుకోకపోతే నానీ లు,బ్రహ్మోత్సవాలు, స్పైడర్లు వస్తాయి. అలాగని చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని లేదు. జయాపజయాలు సహజమైన ఈ ఫీల్డ్ లో ఫెయిల్డ్ సినిమాకు కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది…సానుభూతి ఉంటుంది .అది కూడా మిస్ అయ్యే స్థాయిలో ఒక ఫెయిల్యూర్ వస్తే ఆ డిస్ క్రెడిట్ ఖచ్చితంగా దర్శకుడికే చెందుతుంది.

అయితే ఫలితాలు ఎలా ఉన్నా తన సినిమాల విజయాల క్రెడిట్ ను తన దర్శకులకు ఆపాదించి అపజయ భారాన్ని మౌనంగా తన భుజాన వేసుకునే సంస్కారి మహేష్ బాబు అన్నది  నిజం.  మహేష్ బాబు లోని ఈ పాజిటివ్ యాంగిల్ మంచిదే…తను ‘డైరెక్టర్స్ పెట్ ‘ అవ్వటం అభినందించదగిన విషయమే. కానీ దాన్ని నిలుపుకోవటంలో కొందరు దర్శకుల అవివేక, నిర్లక్ష్యాలను ఉపేక్షించకూడదు. ఈ నేపధ్యంలో దర్శకుల ఎంపిక విషయంలో మా మహేష్ బాబు మరింత అప్రమత్తంగా ఉండాలన్నది అభిమానుల మనోగతం.

కుడుమిస్తే పండగ అన్నట్లుగా ఒక హిట్టిస్తే సంబరాలు చేసుకోవటం తప్ప మరేమీ ఆశించని అభిమానులను  మహేష్ బాబు మున్ముందు మరిన్ని విజయాలతో మరింతగా అలరిస్తారని ఆశిస్తూ ఆయన అశేష అభిమానుల పక్షాన ,తన పక్షానా ఆ “స్టైలిష్ సూపర్ స్టార్” కు జన్మదిన శుభాకాంక్షలు పలుకుతూ రాబోయే” మహేష్ 25 “ఘన విజయాన్ని సాధించాలని ఆశిస్తూ అభినందిస్తుంది… “తెలుగు ఫిల్మ్ నగర్ డాట్ కామ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here