ఆగస్ట్ 15 న ‘అరవింద సమేత..’ టీజర్ లాంచ్ .

Aravindha Sametha Movie Latest News, Aravindha Sametha Movie Teaser, Aravindha Sametha Movie Teaser Release Date Confirmed, Aravindha Sametha Teaser, Jr NTR Aravindha Sametha Teaser, Latest Telugu Movie News, Telugu Filmnagar, Telugu Movie Updates, Tollywood Latest News, Young Tiger Aravindha Sametha Movie Teaser
Aravindha Sametha Movie Teaser Release Date Confirmed

యంగ్ టైగర్ ఎన్టీయార్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తొలి కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని బ్యానర్ లో నిర్మితమౌతున్న ‘అరవింద సమేత వీర రాఘవ ‘ అక్టోబర్ 11 న దసరా కానుకగా వస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పటి వరకు ఆ సినిమాకు చెందిన ఒకటీ అరా లీక్ డ్ స్టిల్స్ తప్ప ఎలాంటి విజువల్స్ బయటికి రాలేదు. మాస్ హీరో యన్.టి. ఆర్.

క్లాస్ డైరెక్టర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో గెట్ అప్ లు, సెట్ అప్ లు ఎలా ఉంటాయి అన్న ఉత్సుకత అందరిలో ఉంది.ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా అప్డేట్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.ఆ నిరీక్షణ కు ఈ నెల 15 న తెరపడబోతుందని చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ కొద్ది సేపటి క్రితం ట్వీట్ చేశారు. ఈ నెల 15 న ‘అరవింద సమేత …టీజర్ రిలీజ్ చేస్తున్నట్లుగా త్రివిక్రమ్ చేసిన ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది.

సెప్టెంబర్ ఫస్ట్ వీక్ దాకా షూటింగ్ జరిగే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ,ఆడియో రిలీజ్,ప్రీ రిలీజ్ ఫంక్షన్ వంటి కార్యక్రమాలు అన్నీ సెప్టెంబర్లొనే జరుగుతాయి. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఎన్ టి ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ లొనే కాకుండా త్రివిక్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ అయింది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here