బయోపిక్ మూవీస్ కు అర్హతగలవారు

Tollywood Actors are Eligible For Biopic Movies,Latest Telugu Movies,Telugu Filmnagar,Telugu Movie Updates,Tollywood Latest News,Tollywood Biopics to Look Forward,Eligible Biopics of Tollywood Actors,Upcoming Biopic Movies in Tollywood,Biopic Movies in Telugu,Tollywood Actors Biopic Movies
Tollywood Actors are Eligible For Biopic Movies

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. నటి సావిత్రి బయోపిక్ మూవీ మహానటి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ,ఎన్టీఆర్,వైఎస్సార్ బయోపిక్స్ సినిమాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. దర్శకుడు కె విశ్వనాధ్ బయోపిక్ మూవీకి  పూజ జరిగింది. సినిమా ఫీల్డ్ లో బయోపిక్ మూవీస్ కు సూటయ్యేవారి గురించి తెలుసుకుందాం. చిత్తూరు నాగయ్య :చిత్తూరు నాగయ్య సింగింగ్ స్టార్. సంగీత దర్శకుడిగా,గాయకుడిగా అద్భుతమయిన ప్రతిభ కలవారు. సినీ ఫీల్డ్ లో స్టార్ డమ్ పొందిన తొలి వ్యక్తి.
ఆయన దాన ధర్మాలు,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గొప్ప పాత్రలలో నటించడం బయోపిక్ మెటీరియల్.

కె వి రెడ్డి :జనాకర్షక ఫార్ములా తో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు కె వి రెడ్డి. పాతాళ భైరవి,మాయాబజార్ వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. మాయ బజార్ సినిమా ఎలా రూపొందిందనే అంశంతో కె వి రెడ్డి బయోపిక్ మూవీ నిర్మించవచ్చు. రైటర్ పింగళి,కెమెరామన్ మార్కస్ బారట్లే,కళా దర్శకుడు గోఖలే వంటి వారిని కూడా చూడవచ్చు.

అక్కినేని నాగేశ్వరరావు :ఏఎన్నార్ నాటకాలలో స్త్రీ పాత్రలు పోషించేవారు. చెన్నై చేరుకున్నాక జానపద సినిమాలలో నటించారు. గొంతు,పర్సనాలిటీ విషయం లో స్ట్రగుల్ పడ్డారు. మరో నటుడు ఎన్టీఆర్ కు ధీటుగా నిలబడడానికి చేసిన కఠోర శ్రమ,హైదరాబాద్ లో స్టూడియో నిర్మించడం,సినీకెరీర్ పీక్ లో ఉండగా మశూచి బారిన పాడడం,హార్ట్ ఆపరేషన్ వల్ల కెరీర్ కు దూరమవ్వడం,క్లిష్ట పరిస్థితులు దాటుకుని హీరో గా కొనసాగడం వంటివి బయోపిక్ కు సరిపోతాయి.

జమున :సినీ ఫీల్డ్ లో గ్లామరస్ హీరోయిన్ గా వెలుగొందడం,సత్య భామ పాత్రలో లీనమైనటించే జమునే సత్య భామ అనుకొనేలా నటించడం,ఆత్మభిమానం గల జమున ను ఒక టైమ్ లో ఏఎన్నార్,ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోలు తమ సినిమాలలో దూరం పెట్టినపుడు హిందీ సినిమాలలో నటించి పేరుపొందడం,హరనాథ్ ను సినీ ఫీల్డ్ లో ఎస్టాబ్లిష్ చేయడం,రాజకీయాలలో సక్సెస్ అయినజమున బయోపిక్ చేయడానికి సూట్ అవుతుంది.

సూర్యకాంతం :గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరు సూర్యకాంతం. పిల్లలకు సూర్యకాంతం  పేరు పెట్టడానికి భయ పడేలా చేసిన ఘనత ఆమెదే. సూర్యకాంతం సినిమాలను,సీరియల్స్ ను కూడా ప్రభావితం చేశారు. తెర జీవితానికి,నిజ జీవితానికి సంబంధం లేని సూర్యకాంతం బయోపిక్ మూవీ చేస్తే రేలంగి,రమణారెడ్డి,అల్లు,పద్మనాభం బియోపిక్స్ ను పరోక్షంగా తీయడమే.

రాజబాబు :స్టార్ కమెడియన్ రాజబాబు బయోపిక్ చేస్తే రమాప్రభ బయోపిక్ మూవీ చేసినట్టే.  వెండితెర గొప్ప హాస్యజంట రాజ బాబు,రమాప్రభ. వీరితో పాటు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ వి రంగ రావు,ఘంటసాల,కాంతారావు,బాపు -రమణ,వాణిశ్రీ,హరనాథ్,దాసరి వంటి వారిపై బయోపిక్ మూవీస్ చేయదగినవే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here