మెగా స్టార్ చిరంజీవి సినిమాలో అనుష్క ?

Anushka Next Movie with Megastar Chiranjeevi,Telugu Flimnagar,Tollywood Latest News,Telugu Movie Updates,Latest Telugu Movies,Mega Star Chiranjeevi Next Projects,Anushka Upcoming Movies,Megastar Chiranjeevi With Anushka Next Movie,Chiranjeevi Anushka Combination Film, Megastar Chiranjeevi 151 Film Updates,Anushka Work With Chiranjeevi Upcoming Movie
Anushka Next Movie with Megastar Chiranjeevi

శ్రీమంతుడు,జనతా గ్యారేజ్,భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహించే సినిమాలన్నిటిలోనూ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. ఈ సినిమాకు కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ తో కూడుకున్న స్టోరీని కొరటాల శివ రెడీ చేస్తున్నారు.

సూపర్ సినిమాతో చిత్ర సీమకు అనుష్క పరిచయమయ్యారు. అనుష్క హీరోయిన్ గా నటించిన విక్రమార్కుడు,అరుంధతి,బాహుబలి,రుద్రమ దేవి,భాగమతి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. భాగమతి సినిమా తరువాత ఏ సినిమా కు అనుష్క ఓకే చేయలేదు.  చిరంజీవి నటించేఈ  సినిమాలో అనుష్క ను హీరోయిన్ గా కొరటాల శివ సెలెక్ట్ చేసి ఆమెను సంప్రదించినట్టు, అనుష్క తన అంగీకారం తెలిపినట్టు సమాచారం.స్టాలిన్ బ్లాక్ బస్టర్ మూవీ లో చిరంజీవి తో ఒక సాంగ్ లో అనుష్క నటించారు.ఈ వార్త నిజమయితే 12సంవత్సరాల తరువాత అనుష్క చిరంజీవి తో జోడీ కట్టడం విశేషం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here