అశ్వనీదత్ సెంటిమెంట్ దిల్ రాజు కు వర్తిస్తుందా?

Ashwini Dutts Sentiment valid for Dil Raju,Telugu Flimnagar,Tollywood Cinema Latest News,Telugu Flim Updates,Latest Telugu Movies,Producer Dil Raj Valid the Ashwini Dutts Sentiment,Dil Raj Verses Ashwini Dutts,Dil Raju Accepts Ashwini Dutts Sentiment,Ashwini Dutts Sentiment Movies
Ashwini Dutt’s Sentiment valid for Dil Raju?

ఫలనా డైరెక్టర్ అయితే సినిమా ప్లాప్,ఫలాన హీరోయిన్ ఐరన్ లెగ్ వంటి ఫ్యూలిష్ సెంటిమెంట్స్ తో ఒకరి కెరీర్ ను పుల్ డౌన్ చేసే సెంటిమెంట్స్ ను ఎంకరేజ్ చేయకూడదు గానీ కొన్ని డేట్స్,ముహూర్తాలు వంటివి  కలిసి వస్తాయి అన్న సెంటిమెంట్స్ ను మాత్రం వాళ్ళ వ్యక్తిగత నమ్మకాలుగా గౌరవించాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అలాంటి సెంటిమెంట్స్ ను బాగా నమ్ముతారు కాబట్టి…అవి చాలా సందర్భాలలో నిజమని ఋజువయ్యాయి కాబట్టి. ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఈ సంవత్సరంలో అలాంటి  బలమైన సెంటిమెంట్  ఒకటి  ఆల్రెడీ ప్రూవ్ అయింది..మరొకటి ఆగస్ట్ 9 న ప్రూవ్ కాబోతుంది.ఆ వివరాలు ఏమిటో చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి-ఆల్ ఇండియా గ్లామర్ క్వీన్ శ్రీదేవి కాంబినేషన్ లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దరకత్వంలో తాను ప్రతిష్టాత్మకంగా  నిర్మించిన’జగదేక వీరుడు-అతిలోకసుందరి’ చిత్రాన్ని 1990-మే 9 న విడుదల చేసారు వైజయంతి అధినేత అగ్ర నిర్మాత అశ్వనీదత్.  అది ఎంతటి  ఘన విజయాన్ని సొంతం చేసుకుందో చెప్పనవసరం లేదు. ఆ తరువాత 28 ఏళ్లకు ఆ ‘డేట్’ సెంటిమెంట్ తో 2018 మే 9న ‘మహానటి‘ చిత్రాన్ని విడుదల చేసారు. ఇక ఈ తాజా విజయం వైజయంతి సంస్థకు పూర్వ వైభవాన్ని తెచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు ఇలాంటి ‘డేట్ ‘ సెంటిమెంట్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు విషయంలో కూడా పునరావృతం అవుతుందనే ఆశాభావం ఆ కాంపౌండ్ లో బలంగా ఉంది. ఎందుకంటే 12 ఏళ్ల క్రితం 2006 ఆగస్ట్ 9న ‘బొమ్మరిల్లు’ చిత్రాన్ని విడుదల చేశారు దిల్ రాజు.అది ఫీల్ గుడ్ చిత్రాలలో ఒక ట్రెండ్ సెట్టర్ గా ఎంత సంచలన విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే ఆగస్ట్ 9 న తన తాజా సకుటుంబ సమేత చిత్రం ‘శ్రీనివాస కల్యాణం ‘ ను భారీ అంచనాల నడుమ రిలీజ్ చేస్తున్నారు . సో..దిల్ రాజు కు పుష్కర కాలం నాటి ఘన విజయం పునరావృతం అవుతుంది అనటంలో ఎలాంటి సందేహమూ లేదు.ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూ షోలు చూసిన కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు .so the proven sentiment is going to be repeated.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here