ఇద్దరు శతాధిక దర్శకులనిచ్చిన కె.రాఘవ ఇక లేరు

Producer K Raghava is No More,Latest Telugu Movies 2018,Telugu Filmnagar,Telugu New Movies,Tollywood Upcoming Movie News,Senior Producer K Raghava Passed Away,Famous Producer K Raghava Passes Away At 105,RIP Tollywood Famous Producer K Raghava,Legendary Producer Kotipalli Raghava Is No More
Producer K Raghava is No More

తెలుగు చలనచిత్ర చరిత్రలోని సమస్త పరిణామాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ప్రముఖ నిర్మాత కె. రాఘవ ఈ రోజు(మంగళవారం జులై,31) వేకువజామున హైదరాబాద్ లో కన్నుమూశారు.105 సంవత్సరాల వయసున్న శతాధిక వృద్ధుడైన కె.రాఘవ 8 ఏళ్ల వయసులో తండ్రి తిట్టడాన్ని ఇంటి నుండి పారిపోయి అనేక కష్ట నష్టాలు అనుభవించి చివరకు ట్రాలీ బాయ్ గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత ఎమ్.జీ. ఆర్.,ఎన్. టీ. ఆర్.,శివాజిగనేశన్ వంటి టాప్ స్టార్స్ కు డూప్ గా,ఫైటర్ గా అనేక చిత్రాలకు పనిచేశారు.

అలా కష్టపడుతూనే కూడబెట్టిన డబ్బుతో నిర్మాతగా ఎదిగారు.తొలుత ఏకాంబరేశ్వరరావు అనే నిర్మాతతో కలసి ‘సుఖ దుక్ఖా లు ‘ చిత్రాన్ని నిర్మించారు. అది మంచి విజయాన్ని సాధించటంతో S V రంగారావు ప్రధాన పాత్రధారి గా జగత్ కిలాడిలు,జగత్ జంత్రీలు,జగత్ జట్టీలు వంటి టైటిల్ సీరీస్ నిర్మించారు.ఈ చిత్రాలకు రైటర్ గా ,అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన దాసరి నారాయణరావు లోని ప్రతిభ ను,చురుకుదనాన్ని గమనించి ఆయన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.రాఘవ నిర్మించిన ” తాతా-మనవడు “సంచలన విజయాన్ని సాధించింది.

అలాగే “ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య ” చిత్రం ద్వారా కోడి రామకృష్ణ ను దర్శకుడిగా పరిచయం చేసిన ఘనత కె.రాఘవదే. “నేను పరిచయం చేసిన గురుశిష్యులిద్దరు నా కళ్ళ ముందే శతాధిక చిత్ర దర్శకుకులుగా ఎదగడo నాకు గర్వకారణం ” అంటారు కె.రాఘవ. తన 9 పదుల సుదీర్ఘ సినీ జీవితంలో కె.రాఘవ 27 చిత్రాలను నిర్మించగా వాటిలో 25 చిత్రాలు విజయవంతం కావటం ఆయన నిర్మాణ దక్షతకు అద్దం పడుతుంది. స్వరాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కి కె.రాఘవ చేసిన కృషి మరువలేనిది. ఆయన సేవలకు గుర్తింపుగా ఆయనను ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు సాయంత్రం జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానం లో కె.రాఘవ అంత్యక్రియలు జరుగుతాయి.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here