కొత్త రకం ప్రేమ కథ “పెదవి దాటాని మాటొకటుంది “

Pedavi Datani Matokatundhi Movie Review, Pedavi Datani Matokatundhi Telugu Movie Review, Pedavi Datani Matokatundhi Movie PUBLIC RESPONSE, Pedavi Datani Matokatundhi Review & Rating, Pedavi Datani Matokatundhi Public Talk, Pedavi Datani Matokatundhi Movie Story, Pedavi Datani Matokatundhi Telugu Cinema Updates, Telugu FilmNagar, Telugu Movie Review, Telugu Cinema Updates 2018, Latest Tollywood Film Reviews 2018
Pedavi Datani Matokatundhi Movie Review

వైవిధ్యమైన కథాంశాలు కావాలని, రావాలని అందరూ అంటారు.కానీ నిజంగా వైవిధ్యభరితమైన సినిమాలు వస్తే ఎంతమంది చూస్తున్నారు. ఎవరు చూసినా చూడకున్నా తాము వైవిధ్యం అని నమ్మిన దాన్ని పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో,నమ్మకంతో పూర్తిచేస్తారు కొంత మంది. అలాంటి ఆత్మవిశ్వాసంతో కొంతమంది ఔత్సాహిక యువత కలిసి రూపొందించిన విభిన్న కథాంశ చిత్రమే ‘ పెదవి దాటాని మాటొకటుంది’ .

హీరోలు అంటే ఎంతప్పటికి చాలా పోష్ గా,హైటెక్ లుక్స్ తో ,సాఫ్ట్ వేర్ జాబ్స్ తో ఎంజాయ్ చేసే యూత్ మాత్రమే కాదు..అవసరం అయితే jonitor జాబ్స్ …అంటే బాత్ రూమ్ లు కడిగే జాబ్ కైనా సిద్ధపడే ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్ ‘ యూత్ లో కనిపించాలి. అదే ఇందులో హీరో జాబ్. స్కూల్ డేస్ లో,కాలేజ్ డేస్ లో చదువుకోకుండా అల్లరి చిల్లరాగా తిరిగిన హీరో, అతని ఫ్రెండ్ చివరికి జానిటర్స్ కు ట్రైనింగ్ ఇచ్చే కంపెనీలో చేరతారు. కాలేజ్ రోజుల్లో తమ మ్యూజిక్ బ్యాచ్ లో చేర్చుకోమని వచ్చిన క్లాస్ మేట్ ను వీళ్లు దారుణంగా అవమానిస్తారు .వీళ్ళ మీద కసితో అతను ఈ బాత్ రూమ్ క్లీనింగ్ కంపెనీ పెట్టి వీళ్లకు వేరే జాబ్స్ రాకుండా చేసి చచ్చినట్టు తన దగ్గరే చేసేటట్టు అగ్రిమెంట్ చేయించుకుంటాడు.

అలాగే స్కూల్ డేస్ లో తనకు ప్రపోజ్ చేసిన అహన (పాయల్ వధన్)అనే అమ్మాయిని కూడా అవమానిస్తాడు హీరో. ఆ అమ్మాయి ఆత్మవిశ్వాసం తో ఒక పొజిషన్ కు చేరుకోవడమే కాకుండా చాలా స్టయిలిష్ గా తయారవుతుంది.అలా ఒకప్పుడు తాను నిర్లక్ష్యం చుసిన వాళ్ళే తనకంటే ఉన్నతంగా ఎడగటంతో మన హీరో లో ఇంఫీరియార్టీ మొదలవుతుంది. ఇక తల్లి లేని పిల్లాడైన హీరో తన తండ్రి (సీనియర్ నరేష్ ) తో నిత్యం గిల్లికజ్జాలు పెట్టుకుంటుంటాడు. ఇలాంటి స్థితిలో హీరో లో తన ప్రేమను వ్యక్తం చేయలేని బలహీనత ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడు ప్రేమ దేవుడు ‘ క్యూపిడ్ ‘ ప్రతినిధి మూడు ప్రేమ జంటలను కలిపితే నీ ప్రేమ సక్సెస్ అవుతుంది అని చెప్తాడు. ఇలా తమ ప్రేమను వ్యక్తం చేయలేకపోయి ప్రేమలో ఫెయిల్ అయిన వాళ్ళు క్యూపిడ్స్ రూపంలో తిరుగుతుంటారు. ఇప్పడు ఒక క్యూపిడ్ మన హీరో వెంటపడి అతను మూడు జంటలను కలిపేందుకు సహకరిస్తాడు.

ఇంతకు మన హీరో మూడు జంటలను కలపడంలో సక్సెస్ అయ్యాడా…? తన ప్రేమను గెలిపించుకోగలిగాడా…? తన తండ్రి మెప్పు పొందగలిగాడా…? వంటి ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది ఈ సినిమా క్లైమాక్స్. గతంలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవం ఉన్న ఈ చిత్ర దర్శకుడు T.గురు ప్రసాద్ ఈ ‘క్యూపిడ్’ కాన్సెప్ట్ ను ఎక్కడనుండి అడాప్ట్ చేసుకున్నారో గానీ ఇది మన ప్రేక్షకులకు పూర్తిగా కొత్తది. కొత్త హీరో పవన్ రెడ్డి,కొత్త హీరోయిన్ పాయల్ వాద్వా, సీనియర్ నరేష్ ..ఇతర నటీనట వర్గం అప్ టు ద మార్క్ చేశారు. ఇక మ్యూజిక్, కేమెరా ,ఎడిటింగ్ వంటి సాంకేతిక శాఖల పనితీరు కూడా బాగుంది. అలాగే కొత్త నిర్మాతలు శ్రీమతి అతిథి, టి. జీ. కీర్తి కుమార్ లు మంచి నిర్మాణ విలువలు కనబరిచారు . మొత్తానికి ఒక ఫ్రెష్ అండ్ న్యూ కాన్సెప్ట్ తో వచ్చిన డైరెక్టర్ టి. గురు ప్రసాద్ అండ్ టీంకు ఆల్ ద బెస్ట్., టి. జీ. కీర్తి కుమార్ లు మంచి నిర్మాణ విలువలు కనబరిచారు . మొత్తానికి ఒక ఫ్రెష్ అండ్ న్యూ కాన్సెప్ట్ తో వచ్చిన డైరెక్టర్ టి. గురు ప్రసాద్ అండ్ టీంకు ఆల్ ద బెస్ట్.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here