రివ్యూయర్స్ కు నా RX 100 లో రొమాన్స్ మాత్రమే కనిపించిందా ?

Ajay Bhupathi questions Critics,Telugu Filmnagar,Latest Telugu Movie News,Tollywood Movie Update,Telugu Film News 2018,Director Ajay Bhupathi Latest News,RX 100 Director Ajay Bhupathi questions Critics,Ajay Bhupathi About RX 100 Movie,Ajay Bhupathi About RX 100 Telugu Movie
Ajay Bhupathi questions Critics

“నా ‘ RX100 ‘ సినిమా మీద సమీక్షలు రాసిన వారికి 140 నిముషాల సినిమాలో ఎమోషన్స్ కనిపించలేదు…కేవలం ఆరు నిముషాల రొమాన్స్ మాత్రమే కనిపించిందంటే వాళ్ళ ఆలోచన ఎంత తప్పుగా ఉందో అర్ధం అవుతుంది. ప్రేక్షకుల మైండ్ లో ఆ ఆలోచన లేదు కాబట్టే 140 నిముషాల సినిమాకు కనెక్ట్ అయ్యారు.రివ్యూ రైటర్స్ తమ ఇష్టం వచ్చినట్లు రివ్యూలు రాసి సినిమాలకు అన్యాయం చేస్తున్నారు ” అంటూ రివ్యూల పైన ,రివ్యూ రైటర్స్ మీద తన కోపాన్ని ,అసహనాన్ని వెళ్ళగక్కాడు ఆ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి.

నిజానికి అతని ఆవేదనలో కొంత అర్ధం లేకపోలేదు. RX100 అనే సినిమాను ఒక బూతు సినిమాగా,బోల్డ్ అండ్ బాడ్ సినిమాగా కొందరు విశ్లేషకులు సమీక్షించడం సమంజసం కాదు. అలాగని అదొక గొప్ప సినిమా అని సమర్ధించడం లేదు.అయితే ఒక దర్శకుడు తాను ఎంచుకున్న సబ్జెక్టును ఎంత ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేసాడు అనే కోణంలో విశ్లేషిస్తే అజయ్ భూపతి RX100 ను సాధ్యమైన మేరకు నీట్ గానే తీసాడని చెప్పవచ్చు. క్యారెక్టర్ లేని హీరోయిన్ క్యారెక్టర్ దృష్ట్యా ఎంత పచ్చి గా తియ్యటానికి అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు దాని మీద దృష్టి పెట్టలేదు.

హీరోయిన్ తన కోరిక తీర్చుకోవడం కోసం హీరోను వాడుకున్న సందర్భంలో ఆ పర్టిక్యులర్ సన్నివేశంలో హీరోను రెచ్చగొట్టడం కోసం ‘లిప్ టు లిప్ ‘ షాట్ తీశాడే తప్ప సినిమా మొత్తాన్ని ముద్దు సీన్ల తో ముంచెత్తాలనే ఇంటెన్షన్ దర్శకుడిలో ఏ మాత్రం కనిపించలేదు. ఆ లిప్ లాక్ ను కూడా ఏ మాత్రం అసభ్యతకు తావు లేకుండా తీసాడన్నది నిజం. మిగిలిన ఏ సన్నివేశం లోను కనీసం హీరోయిన్ క్లివెజ్ ని కూడా చూపించలేదు.

మరి కథాపరంగా, హీరోయిన్ క్యారెక్టర్ పరంగా అవకాశం ఉన్నప్పటికీ ఆ కుషన్ ను వాడుకోని దర్శకుడి హానెస్టీ ని అభినందిచకపోగా దానిని ఒక బూతు సినిమాగా గ్రేడ్ చేయటం ఏమి విశ్లేషణ ? సినిమాలో నిజమైన దమ్ము లేకుండా కేవలం ముద్దు సీన్ల వల్లనే ఇంత పెద్ద హిట్ అవుతుందా? నిజానికి ఆ ముద్దు సీన్లు లేకపోయినా ఆ సినిమా విజయానికి వచ్చే లోటు ఏమి ఉండదు.

ఎందుకంటే హీరోయిన్ క్యారెక్టర్ ను రివర్స్ లో చూపడమే ఆ సినిమాలోని ఫార్ములా .మరి మన సమీక్షలకు ప్రేక్షకుల అభిరుచికి మధ్య ఇంత వ్యత్యాసం ఉంటున్నప్పుడు మన రివ్యూలను కూడా మనం రివ్యూ చేసుకోవలసిన అవసరం ఉంది. Reviewing a film is not our right …it’s our responsibility అనే కోణంలో ఆలోచిస్తే మన రివ్యూ ల మీద రివ్యూ లకు,రివిషన్ లకు ఎవరికి అవకాశం దొరకదు. ఏ జోనర్ సినిమాను ఆ జోనర్ నామ్స్ లో రివ్యూ చెయ్యాలే గాని శంకరాభరణం ను RX 100 ను ఒకే లెన్స్ నుండి వీక్షించడం కరెక్ట్ కాదేమో….

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here