1970ల నేప‌థ్యంలో రాజ‌శేఖ‌ర్ చిత్రం

Rajasekhar Next an Action Cop 70s Era Drama,Telugu Filmnagar,Tollywood Upcoming Movie News,Latest Telugu Movies 2018,Telugu New Movies,Actor Rajasekhar Next Action Cop 70s,Rajasekhar Upcoming Movie Details,Rajasekhar New Movie Role Revealed,Rajasekhar Latest News,Rajasekhar Next Movie Role
Rajasekhar next an action cop 70s era drama

ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన క‌థానాయ‌కుల్లో రాజ‌శేఖ‌ర్ ఒక‌రు. ‘అంకుశం’ చిత్రంలో పోలీస్ అధికారిగా న‌ట విశ్వ‌రూపం చూపించారాయ‌న‌. ఇదిలా ఉంటే.. తాజాగా మ‌రో సారి పోలీస్ పాత్ర‌లో ఆయ‌న క‌నిపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలిసింది.

ఆ వివరాల్లోకి వెళితే.. ‘అ!’ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ప్ర‌స్తుతం ‘క్వీన్’ రీమేక్ ‘ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి’తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్త‌య్యాక‌ రాజ‌శేఖ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ మూవీని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ ఏడాది చివ‌రిలో ప‌ట్టాలెక్క‌నున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌లో రాజ‌శేఖ‌ర్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం. 1970ల బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here