ఆస‌క్తిక‌రంగా శ్రీ‌నివాస క‌ళ్యాణం కాన్సెప్ట్ టీజ‌ర్‌

Srinivasa kalyanam Concept Teaser Out Now, Srinivasa Kalyanam Concept Teaser Released, Srinivasa Kalyanam Movie Concept Teaser, Srinivasa Kalyanam Telugu Movie Concept Teaser,Theme Of Srinivasa Kalyanam, Telugu Filmnagar, Telugu Movie News 2018, Latest Telugu Film News, Tollywood Cinema Updates, Nithiin Srinivasa Kalyanam Concept Teaser,Srinivasa kalyanam Movie Updates,Srinivasa kalyanam Telugu Movie Latest News
Srinivasa kalyanam Concept Teaser Out Now

నితిన్, రాశి ఖన్నా జంట‌గా నటిస్తున్న చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. సతీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయ‌ర్ సంగీత‌మందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కాన్సెప్ట్ టీజ‌ర్‌, ఆడియో రిలీజ్ డేట్‌ను ఈ రోజు ఉద‌యం ఆవిష్క‌రించారు.

”మ‌నం పుట్టిన‌ప్పుడు మ‌న‌వాళ్ళంద‌రూ ఆనంద‌ప‌డ‌తారు. అది మ‌న‌కు తెలియ‌దు. మ‌నం దూర‌మైన‌ప్పుడు మ‌న వాళ్ళంద‌రు బాధ‌ప‌డ‌తారు. అదీ మ‌న‌కు తెలియ‌దు. మ‌న‌కు తెలిసి మ‌నం సంతోషంగా ఉండి మ‌న వాళ్ళంద‌రూ సంతోషంగా ఉండేది ఒక్క పెళ్ళిలో మాత్ర‌మే. అలాంటి పెళ్ళి గొప్ప‌త‌నం గురించి చెప్పే ఓ చిన్ని ప్ర‌య‌త్న‌మే మా ఈ ‘శ్రీ‌నివాస క‌ళ్యాణం’ ” అంటూ స‌హ‌జ న‌టి జ‌య‌సుధ వాయిస్ ఓవ‌ర్‌లో విడుద‌లైన కాన్సెప్ట్ టీజ‌ర్.. సినిమాపై ఆస‌క్తిని, అంచనాల‌ను పెంచింది.

కాగా.. ఈ సినిమా ఆడియోను ఈ నెల 22న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో అధికారికంగా ప్ర‌క‌టించింది. సినిమాని ఆగ‌స్టు 9న విడుద‌ల చేయ‌బోతున్నారు.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here