ర‌జ‌నీ కాంత్ పాత్ర‌లో రెండు షేడ్స్‌ 

Rajinikanth Dual Role In His Upcoming Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Cinema Updates,Telugu Film News 2018,Superstar Rajinikanth Upcoming Movie News,Rajinikanth Next Film Updates,Rajinikanth Dule Role In His Next Film,Rajinikanth Next Movies List
Rajinikanth Dual Role In His Upcoming Movie

సూపర్ స్టార్ రజనీ కాంత్ క‌థానాయ‌కుడిగా ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతున్న విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో కనిపించనుండగా.. రజనీకాంత్ కుమారులుగా బాబీ సింహా, సనత్ రెడ్డి నటిస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన సిమ్రాన్.. ఈ సినిమాలో తొలిసారి రజనీ కాంత్ సరసన నటిస్తున్నారు. అలాగే.. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరుతెచ్చుకున్న నవాజుద్దీన్ సిద్ధిఖి ఈ చిత్రంతో కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన విషయమొకటి బయటికి వచ్చింది. అదేమిటంటే.. ఈ సినిమాలో రజనీ కాంత్ రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది. పగలంతా ఓ హాస్టల్‌కి వార్డెన్‌లా ఉంటూ.. రాత్రి అయ్యేసరికి డాన్‌గా క‌నిపించ‌నున్నార‌ని సమాచారం. మ‌రి.. ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.

కాగా.. ప్రస్తుతం డెహ్రాడున్‌లో చిత్రీకరణ జరుగుతుండ‌గా.. తదుపరి షెడ్యూల్‌ను చెన్నైలో ప్లాన్ చేస్తున్నారు. ఆగష్టు 10 నుంచి జరగబోయే ఈ షెడ్యూల్ కోసం చెన్నైలో మధురై సెట్‌ను కూడా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. దీని తర్వాత లక్నోలో తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో రజనీకాంత్, సన్ పిక్చర్స్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎందిరన్’ (తెలుగులో ‘రోబో’) ఘ‌న‌ విజ‌యం సాధించిన‌ సంగతి విదితమే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here