ల‌వ‌ర్ క్లైమాక్స్ స‌మ్‌థింగ్ స్పెష‌ల్ అని అనిపించేలా ఉంటుంది – దిల్ రాజు

Dil Raju About Lover Movie and his Upcoming Movies, Dil Raju Upcoming Films, Dil Raju About Lover Movie Story, Dil Raju Opens Up About His 7 Upcoming Movies,Telugu Filmnagar, Telugu Movie News 2018, Latest Telugu Film News, Tollywood Cinema Updates
Dil Raju About Lover Movie and His Upcoming Movies

దిల్ రాజు.. ప‌రిచ‌యాలు అక్క‌ర్లేని పేరిది. ఈ బ్రాండ్ ఒక్క‌టి చాలు.. అభిరుచి ఉన్న సినీ ప్రేక్ష‌కులు థియేట‌ర్ల వైపు అడుగులు వేయ‌డానికి. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై ఓ సినిమా వ‌స్తోందంటే.. క‌చ్చితంగా ఆ సినిమాలో క‌థ‌కు పెద్ద పీట వేస్తార‌న్న‌ది స‌గ‌టు ప్రేక్ష‌కుడి అభిప్రాయం. 15 ఏళ్ళ నిర్మాణ ప్ర‌స్థానంలో 25కి పైగా సినిమాలు చేసి.. సింహ‌భాగం విజ‌యాల‌ను అందుకున్నారు దిల్ రాజు. కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాల‌తో ముందుకెళ్తున్న ఈ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌ తాజాగా నిర్మించిన చిత్రం ‘ల‌వ‌ర్‌’. రాజ్ త‌రుణ్‌, రిద్ధీ కుమార్ జంట‌గా ‘అలా ఎలా?’ ఫేమ్ అనీష్ కృష్ణ రూపొందించిన‌ ఈ సినిమా ఈ నెల 20న తెర‌పైకి రానుంది. ఈ సంద‌ర్భంగా దిల్ రాజు పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు..

‘లవర్’ ప్ర‌యాణం
‘అలా ఎలా?’ సినిమా చూసి.. డైరెక్టర్‌ అనీష్‌ కృష్ణ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో ఓ క్యూట్ ఫిల్మ్ తీశాడ‌నిపించింది. ఓ సందర్భంలో తను నన్ను కలిస్తే.. మంచి స్టోరీ ఉంటే చెప్పు చూద్దాం అన్నాను. అలా.. 2016లో ‘ల‌వ‌ర్‘ థీమ్‌ను చెప్పాడు. నాక‌ది నచ్చింది. ఆ త‌రువాత ఆ కథను అనీష్ బాగా డెవలప్‌ చేశాడు. అయితే.. 2017లో ఆరు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉండటంతో.. వెంట‌నే ఈ సినిమా చేయ‌డం కుద‌ర‌లేదు. మా త‌రువాతి త‌రంలో హర్షిత్‌ మూడు, నాలుగేళ్లుగా సినిమా నిర్మాణంలో ట్రావెల్ చేస్తున్నాడు. ఓ సంద‌ర్భంలో.. తను నాతో ‘ఓ సినిమాని ఫుల్‌గా అప్పగించండి.. నేను ఎగ్జ్‌క్యూట్‌ చేస్తాను’ అన్నాడు. క‌థ మొత్తం సిద్ధ‌మ‌య్యాక‌.. హర్షిత్‌ను ఓసారి వినమన్నాను. ‘నీకు నచ్చితే నేను ఇన్‌వాల్వ్‌ కాను’ అన్నాను. హీరో ఎవరు? అని అనుకున్న సమయంలో చాలా రోజులుగా రాజ్‌ తరుణ్‌తో సినిమా చేయాలనుకుంటున్నాం. కాబట్టి.. ఈ సినిమా చేద్దామని అనుకున్నాం. నేను రూ.5 కోట్ల బడ్జెట్‌ ఇచ్చి సినిమా చేయమని అన్నాను. నేను ఇప్పటి వరకు ఏ సినిమాను కూడా రూ.5 కోట్లలో నిర్మించలేదు. అయితే.. మ్యూజిక్ ప‌రంగా డిఫరెంట్‌గా ఉండాల‌ని హర్షిత్ భావించాడు. అందుకే.. ఇందులోని ఐదు పాట‌ల కోసం ఐదుగురు మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌ను ఎంచుకున్నాడు. వారిలో.. బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ పేర్లు కూడా ఉన్నాయి. ఆ లిస్ట్ చూసి నేను షాక్‌ తిన్నాను. మ్యూజిక్ కోసం మనం అంత ఖర్చు పెట్టలేమని హ‌ర్షిత్‌కు చెప్పాను. ‘నేను అడిగిన రెండు, మూడు నాకు ఇవ్వండి’.. అని హర్షిత్‌ అన్నాడు. అలాగే సమీర్‌ రెడ్డి, ఎ.ఎస్‌.ప్రకాష్‌ వంటి టెక్నీషియన్స్‌ను అడిగాడు. సరే  అన్నాను. అలా ఈ సినిమా స్పాన్ పెరిగింది. రాజ్‌తరుణ్‌ అప్‌ కమింగ్‌ హీరో… తన గ‌త‌ రెండు, మూడు సినిమాలు అనుకున్నంత సక్సెస్‌ కాలేదనేది వాస్తవం. ఇందులోని క్లైమాక్స్ స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌గా ఉంటుంది. అది కూడా బడ్జెట్‌లో అంగీకరించాను. హర్షిత్‌ అడిగినవన్నీ అరెంజ్‌ చేయడంతో తను సినిమాను చక్కగా నిర్మించాడు. విజువ‌ల్స్ బాగా కుదిరాయి. ఇప్పుడు టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావ‌డం ఆనందంగా ఉంది. అయితే.. తొలుత రూ.5 కోట్ల బ‌డ్జెట్‌తో అనుకున్న సినిమా కాస్త 40 శాతం అద‌న‌పు ఖ‌ర్చుతో రూ.8 కోట్ల బ‌డ్జెట్‌కు చేరుకుంది. అయితే డిజిట‌ల్‌, శాటిలైట్‌, ఇన్‌బిల్ట్ మార్కెట్ వంటివి తోడ‌వ‌డంతో.. ఇప్పటికే అరవై శాతం రెవెన్యూను కవర్‌ చేసేశాం. ఇక సినిమాని మేమే సొంతంగా రిలీజ్‌ చేస్తున్నాం.

‘లవర్’ ఎలా ఉంటాడంటే..
రాయ‌ల‌సీమ (అనంత‌పురం) నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. రాజ్‌ ఓ అనాథ కుర్రాడు. చిన్న‌ప్పుడే త‌న త‌ల్లి చ‌నిపోతుంది. త‌న క‌ళ్ళ ముందే.. ఏం చేస్తే కాపాడుకోవ‌చ్చో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఆమె చనిపోతుంది. అలాంటి రాజ్ జీవితంలోకి 25 ఏళ్ళ త‌రువాత చ‌రిత అనే మ‌ల‌యాళ అమ్మాయి ఎంట‌ర్ అవుతుంది. త‌న జీవితంలో ఏం కోల్పోయాడో.. ఆ లోట్ల‌న్నీ లేకుండా తన భార్య, పిల్లలకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. అంతా బాగుంద‌నుకున్న స‌మ‌యంలో ఆ అమ్మాయి మిస్ అవుతుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగింద‌న్న‌దే ఈ సినిమా.

RX 100 అందుకు ఉదాహ‌ర‌ణ‌
నేను సాధారణంగా ప్రెజ‌ర్‌ తీసుకోను. అయితే ఈ సినిమాకు ప్రెజ‌ర్‌ తీసుకుంటున్నాను. హర్షిత్‌ నిర్మాతగా చేస్తున్న మొద‌టి సినిమా కావ‌డ‌మే అందుకు కార‌ణం. నిర్మాతగా నేను స‌క్సెస్‌, ఫెయిల్యూర్‌ను సాధారణంగానే తీసుకుంటాను. సినిమా రేంజ్‌ని సక్సెస్‌ ఫెయిల్యూర్‌ డిసైడ్‌ చేస్తాయి. ఎందుకంటే.. సినిమా హిట్‌ అయితే ఎవరూ బడ్జెట్‌ గురించి ఆలోచించరు. ఉదాహ‌ర‌ణ‌కు ‘RX 100‘ విష‌యం తీసుకోండి. రూ.4 కోట్ల‌తో విడుద‌లైన ఈ సినిమా రూ.15 కోట్ల వ‌ర‌కు రాబ‌ట్టే అవ‌కాశం ఉంది. అంటే.. 3 రెట్ల కంటే ఎక్కువ ఫ‌లిత‌మిస్తుంద‌న్న‌మాట‌.

ఈ ఏడాది మూడు సినిమాలే..
ప్రొడ్యూస‌ర్‌గా గత ఏడాది ఆరు వ‌రుస విజ‌యాల‌తో డబుల్‌ హ్యాట్రిక్ అందుకోవ‌డం హ్యాపీ. అయితే.. ఈ సంవ‌త్స‌రం మాత్రం మూడు సినిమాలనే నిర్మిస్తున్నాను. నిర్మాతగా ఆరు సినిమాలు చేసి సక్సెస్‌ కొట్టడం అంత సులభం కాదు.. అయితే ప్రతి ఏడాది కూడా ఆరు సినిమాలు చేసి సక్సెస్‌ కొడతాను అని అనుకోను. వ‌చ్చే ఏడాది నాలుగైదు సినిమాలు రావ‌చ్చు.

మీడియం హీరోతో చేస్తే..
– చిన్న సినిమాలు చేయాలంటే భయమేస్తుంది. ఎందుకంటే చిన్న సినిమాల విషయంలో ప్రేక్షకుడిని థియేటర్‌ వరకు తీసుకు రావ‌డం పెద్ద ప‌ని. ఉదాహరణకు ‘కేరింత’ విష‌యం తీసుకుంటే.. ఎక్కువ‌గా రీచ్ కాలేదు. రిలీజైన తర్వాత సినిమా బాగున్నా కలెక్షన్స్‌ రాకపోయే సరికి యూనిట్‌తో కలిసి టూర్స్‌ వెళ్లాను. అలా పెట్టిన డబ్బును రాబట్టుకునేసరికి చాలా కష్టమైంది. అదే సమయాన్ని వేరే దానికి ఖర్చు పెడితే ఫలితం వేరేలా ఉంటుంది. అందుకే ఓ మీడియం హీరోతో సినిమాలు చేస్తే.. క‌నీసం ప్రేక్షకుడు థియేటర్‌ వరకు వస్తాడు.

క‌థ‌ను బ‌ట్టే..
మల్టీస్టారర్ మూవీస్ చేయడమనేది.. ఏదీ ప్లాన్‌ చేసి చేయడం లేదు. కథను బట్టి అలా కుదురుతుందంతే. ‘ఎఫ్‌2’తోపాటు ఇంద్రగంటిగారి సినిమా రెడీ అవుతుంది. అలాగే హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో చేయాల్సిన‌ ‘దాగుడు మూతలు’ స్క్రిప్ట్ ఇంకా కొలిక్కి రాలేదు. ఆ స‌బ్జెక్ట్ సెట్ కాక‌పోతే.. మ‌రో స‌బ్జెక్ట్‌తో సినిమా చేసే అవ‌కాశముంది.

మహేష్‌25 అవుట్ పుట్ విష‌యంలో హ్యాపీ…
మహేష్ 25వ సినిమా షూటింగ్ బాగా వ‌స్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు షూట్ చేసిన పార్ట్ అంతా బాగా వ‌చ్చింది. మ‌హేష్‌, ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, నేను.. అంతా హ్యాపీ ఈ విష‌యంలో. నెక్ట్ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఆ తర్వాత గోవా షెడ్యూల్‌.. మళ్లీ హైదరాబాద్‌ షెడ్యూల్‌.. ఆ పై అమెరికా షెడ్యూల్‌ ఉంటుంది. ఆ త‌రువాత యూరప్‌లో కూడా ఉంటుంది. ఏప్రిల్ 5న ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నాం.

నో యాక్టింగ్‌.. నో డైరెక్ష‌న్‌
క‌థ‌ల జ‌డ్జిమెంట్ నాకు ప్ల‌స్ పాయింట్‌. అందుకే.. స‌క్సెస్‌ఫుల్ మూవీస్ ఇవ్వ‌గ‌లిగాను. చాలామంది యాక్టింగ్‌, డైరెక్ష‌న్ గురించి అడుగుతున్నారు. నాకు అలాంటి ఆలోచ‌న‌లేవీ లేవు.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌
ప్ర‌స్తుతం నితిన్ హీరోగా నిర్మిస్తున్న ‘శ్రీనివాస కళ్యాణం’ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ నెల 22న ఆడియోను.. ‘బొమ్మరిల్లు’ రిలీజ్‌ డేట్ అయిన ఆగస్టు 9న సినిమాని రిలీజ్ చేయ‌బోతున్నాం. ఇక ద‌స‌రా కానుక‌గా అక్టోబర్‌ 18న ‘హలో గురూ ప్రేమ కోసమే’ విడుద‌ల చేస్తాం. ఇక ‘ఎఫ్‌ 2’ సంక్రాంతికి వ‌స్తుంది. ఏప్రిల్‌ 5న మహేష్‌ 25వ సినిమా రిలీజ్‌ కానున్నాయి. గల్లా అశోక్‌ సినిమా సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ప్రారంభం కావ‌చ్చు. అలాగే ‘ప‌లుకే బంగార‌మాయే’ పేరుతో ఓ సినిమా ఉంటుంది.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


 

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here