RX 100 హిందీ రీమేక్‌పై ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం

RX 100 Movie Remake in Hindi?,Tollywood Upcoming Movie News,Latest Telugu Movies 2018,New Telugu Movies,Telugu Movies News in Telugu,Telugu Cinema News,RX 100 Telugu Movie Remake in Hindi,RX 100 Movie Hindi Remake,Ajay Bhupati RX 100 Hindi Remake Details,RX 100 Movie Latest News
RX 100 Movie Remake in Hindi?

‘RX 100’ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అజ‌య్ భూప‌తి.. మొద‌టి సినిమాతోనే సంచ‌ల‌న విజ‌యం అందుకున్నారు. ప‌రిమిత బ‌డ్జెట్‌తో చిన్న సినిమాగా విడుద‌లైన ఈ సినిమా.. విడుద‌లైన అన్ని చోట్లా వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వీక్ డేస్‌లోనూ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న ఈ సినిమాతో అజ‌య్ భూప‌తి ‘టాక్ ఆఫ్ టాలీవుడ్’ అయ్యారు. ఒక వైపు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల నుంచి ఈ ద‌ర్శ‌కుడికి వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. మ‌రో వైపు.. ‘RX 100’ చిత్రాన్ని హిందీలోనూ రీమేక్ చేయ‌మ‌ని ప్ర‌ముఖ హిందీ నిర్మాణ సంస్థ ఫాంట‌మ్ ఫిల్మ్స్‌కు చెందిన‌ ప్ర‌తినిధి నుంచి కాల్ కూడా వ‌చ్చింద‌ని ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అదే గ‌నుక కార్య‌రూపం దాల్చితే.. త‌న గురువు రామ్ గోపాల్ వ‌ర్మ బాట‌లోనే.. అజ‌య్ భూప‌తి కూడా తొలి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసినట్ల‌వుతుంది. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here