#RRR నేప‌థ్యం అదేనా?

#RRR Backdrop Revealed, #RRR Movie Latest Updates, #RRR Movie Story Revealed?, Jr NTR Role in #RRR Film, Rajamouli Next Movie Story Revealed, Ram Charan Jr Ntr Multistarrer with Rajamouli Story Revealed, Ram Charan Role in SS Rajamouli’s #RRR, Telugu Cinema News, Telugu Filmnagar, Telugu Movie Updates 2018, Tollywood Latest News 2018

‘య‌మ‌దొంగ‌’, ‘మ‌గ‌ధీర’ చిత్రాల‌ను సోషియో ఫాంట‌సీ జోన‌ర్‌లోనూ.. ‘బాహుబ‌లి’ సిరీస్‌ను జాన‌ప‌ద చిత్రాల జోన‌ర్‌లోనూ తెర‌కెక్కించిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని పిరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించ‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా రాజ‌మౌళి ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ (#R R R) చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ అధినేత డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ న‌వంబ‌ర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా నేప‌థ్యం గురించి ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం వినిపిస్తోంది. అదేమిటంటే.. 1947 నాటి బ్రిటీష్ ప్ర‌భుత్వం ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. స్వాతంత్య్ర పోరాట ఘ‌ట్టాల తాలుకూ స‌న్నివేశాల‌తో ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. మ‌రి.. ఈ వార్త‌ల్లో ఎంత వాస్త‌వ‌ముందో త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here