ఆ వార్త‌లు చూసి షాక్ అయ్యాను – కియారా అద్వాని

Kiara Advani About DVV Danayya,Tollywood Upcoming Movie News,Latest Telugu Movies 2018,New Telugu Movies,Telugu Movies News in Telugu,Telugu Cinema News,Actress Kiara Advani About DVV Danayya,Kiara Advani Latest News,Kiara Advani Responds on Producer DVV Danayya Rumours,Producer DVV Danayya Latest Updates
Kiara Advani About DVV Danayya

బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘భ‌ర‌త్ అనే నేను’ కి సంబంధించి ఆ సినిమా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, క‌థానాయిక కియారా అద్వానికి చిత్ర నిర్మాత డి.వి.వి.దాన‌య్య పూర్తి పారితోషికం ఇవ్వ‌లేద‌ని రెండు రోజుల క్రితం ఓ ప్ర‌ముఖ ఆంగ్ల దిన ప‌త్రిక ప్ర‌చురించింది. దీనిపై డి.వి.వి.దాన‌య్య నిర్మాణ సంస్థ అయిన డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్.. ట్విట్ట‌ర్ వేదిక‌గా వివ‌ర‌ణ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అలాగే.. కొర‌టాల శివ కూడా ఈ వార్త‌ల‌ను ఖండించారు. తాజాగా.. చిత్ర క‌థానాయిక కియారా అద్వాని కూడా క్లారిటీ ఇచ్చారు.

”డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, దాన‌య్య గారి గురించి వ‌స్తున్న నిరాధార వార్త‌ల‌ను చూసి షాక్ అయ్యాను. ఇలాంటి ప్రొఫెష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేయ‌డం ఆనందంగా ఉంది. ఒక‌వేళ‌.. నిజంగా ఏదైనా స‌మ‌స్య ఉంటే.. ఒకే సంస్థ‌లో వెంట‌నే ఇంకో సినిమా ఎవ‌రు చేస్తారు? భ‌విష్య‌త్‌లోనూ దాన‌య్య గారితో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నాను” అంటూ క్లారిటీ ఇచ్చారు కియారా అద్వాని.

ప్ర‌స్తుతం కియారా అద్వాని.. రామ్ చ‌ర‌ణ్ హీరోగా బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌కత్వంలో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. హిందీలోనూ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here