త‌మిళ స్టార్ హీరో కొడుకుతో శేఖర్ కమ్ముల తెలుగు చిత్రం

Chiyaan Vikram Son Debut Movie with Sekhar Kammula, Hero Vikram Son Dhruv Debut Movie, Sekhar Kammula To Launch Tamil Star Hero Son, Sekhar Kammula Upcoming Movies, Sekhar Kammula’s Next With Chiyaan Vikram’s Son, Tamil Star Hero Son Debut Movie with Sekhar Kammula, Telugu Cinema Latest News, Telugu Filmnagar, Tollywood Latest Movie Updates 2018, Vikram’s Son Dhruv Telugu Debut Movie
Chiyaan Vikram Son Debut Movie with Sekhar Kammula

‘ఆనంద్’, ‘గోదావరి’, ‘హ్యాపీడేస్’, ‘లీడర్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ లాంటి ఫీల్ గుడ్ మూవీస్ రూపొందించి తెలుగు ప్రేక్షకులకు అభిమాన ద‌ర్శ‌కుడు అయ్యారు శేఖర్ కమ్ముల. ఇక గతేడాది విడుద‌లైన ‘ఫిదా’తో తన స్థాయిని మరింత పెంచుకున్నారు. తన ప్రతీ సినిమాలోనూ కొత్త నటీనటులను పరిచయం చేస్తూ విజయం సాధిస్తూ వచ్చిన శేఖర్ కమ్ముల.. తన తదుపరి చిత్రం కోసం కూడా తనకి అచ్చొచ్చిన బాటలోనే వెళుతున్న‌ట్టు వినికిడి.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు ఈ డైరెక్టర్. డాన్స్ బేస్డ్‌గా తెరకెక్కబోయే ఈ సినిమాలోని హీరో పాత్ర కోసం.. ఒక నూతన నటుడ్ని శేఖ‌ర్ తెలుగు తెర‌కు పరిచయం చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. తమిళ స్టార్ నటుడు ‘చియాన్’ విక్రమ్ తనయుడు ధృవ్‌ను తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది.

కాగా.. ప్రస్తుతం ధృవ్.. బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వర్మ’ (‘అర్జున్ రెడ్డి’ రీమేక్) సినిమాతో కోలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సాధార‌ణంగా క‌థానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రలను రూపొందించే శేఖర్.. తన తదుపరి చిత్రం కోసం కూడా అటువంటి పాత్రనే ఎంచుకున్నారని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం ఇప్పటికే ఒక స్టార్ హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్న‌ట్టు సమాచారం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here