సాక్ష్యం.. ఓ ఇంట్ర‌స్టింగ్ కాన్సెప్ట్‌

Interesting Facts About Saakshyam, Saakshyam Movie Release Date, Bellamkonda Srinivas Saakshyam Movie Updates, Saakshyam Movie Latest News, Telugu Filmnagar, Telugu Movie News 2018, Latest Telugu Film News, Tollywood Cinema Updates
Interesting Facts About Saakshyam

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘సాక్ష్యం’. “నేచర్ ఈజ్ ద‌ విట్‌నెస్” అనేది ఉపశీర్షిక. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మించారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైలర్‌లోని విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉన్నాయి. ట్రైలర్ చూస్తుంటే.. ఇదో సోషియో ఫాంటసీ మూవీ అని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయమొకటి ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే.. ప్రకృతినే సాక్ష్యం చేసిన ఈ సినిమా కథకి.. వీడియో గేమ్స్‌కి మధ్య ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉందని సమాచారం. వీడియో గేమ్స్ డెవలపర్‌గా కనిపించనున్న హీరో.. తాను తయారు చేసిన గేమ్స్‌లోని విలన్స్ లాగే.. తన నిజ జీవితంలోని శత్రువులు కూడా ఒక్కొక్కరూ అంతమైపోతూ ఉంటారట‌. అంటే.. వీడియో గేమ్స్‌లో ఉన్న విలన్స్‌కి.. హీరో లైఫ్‌లో ఉండే విలన్స్‌కి దర్శకుడు ఏదో లింక్ పెట్టి ఉండొచ్చని అంటున్నారు. ఈ పాయింట్ కొత్తగా ఉన్నా.. గతంలో షారుఖ్ ఖాన్ హీరోగా వీడియో గేమ్స్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ‘రా.వన్’ సినిమాకు, ఈ సినిమాకు దగ్గర పోలికలున్నట్టుగా తెలుస్తోంది.

జగపతిబాబు, మీనా, శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించిన  ‘ సాక్ష్యం’ ఈ నెల 27న విడుదల కానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here