2018 సెకండాఫ్‌లో దూసుకొస్తున్న అక్కినేని ఫ్యామిలీ

2018 Second Half Belongs To Akkineni Family, Akkineni Family Movies in 2018, Sushanth Chi La Sow Movie Updates, After 22 years Supriya Is Back With Gudachari, Naga Chaitanya Sailaja Reddy Alludu Movie Release Date, Sumanth Idam Jagath Movie Latest News, Nagarjuna Devadas Movie Latest News, Samantha U Turn Movie Release Date, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Latest Telugu Movies News,

సినిమా ఇండ‌స్ట్రీలో వార‌స‌త్వ హీరోల హ‌వా బలంగా న‌డుస్తోంది. ఒక్కో సినీ కుటుంబం నుండి ఐదారుగురు హీరోలు వ‌చ్చిన‌ప్ప‌టికీ అంద‌రికీ ఎంతో కొంత ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మెగా కాంపౌండ్ త‌రువాత సంఖ్యా ప‌రంగా అక్కినేని కాంపౌండ్‌లో ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. అయితే.. కాంపౌండ్ ఏదైన‌ప్ప‌టికీ వార‌సుడిగా వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికి కెరీర్ కేక్ వాక్‌లాగా ఏమీ సాగ‌డం లేదు. ప్ర‌తి ఒక్క‌రు క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తున్న‌ప్ప‌టికీ.. స‌క్సెస్ అంద‌ని ద్రాక్ష పండులా ఊరిస్తూనే ఉంది. అయితే.. స‌క్సెస్ రాలేదు క‌దా అని రిలాక్స్ అయితే.. అస‌లు ప‌నే లేకుండా పోతుంది. కాబ‌ట్టి సినీ కుటుంబాల వార‌సుల‌కైనా.. బ‌య‌ట హీరోల‌కైనా తార‌క మంత్రం ఒక‌టే.. అదే `హార్డ్ వ‌ర్క్‌`. దాన్ని న‌మ్ముకుంటే స‌క్సెస్ ఇవాళ కాక‌పోయినా రేపు అయినా వ‌స్తుంది. ఇదే సూత్రాన్ని ఫాలో అవుతూ అక్కినేని హీరోలంద‌రూ `ఆన్ జాబ్` బిజీగా ఉన్నారు.

నిజానికి గ‌త కొంత‌కాలంగా అక్కినేని కాంపౌండ్‌తో స‌క్సెస్ దోబూచులాడుతోంది. `న‌మో వెంక‌టేశాయ`, `రాజు గారి గ‌ది 2`, `ఆఫీస‌ర్` చిత్రాలు నాగార్జున‌కు బిగ్ డిజ‌ప్పాయింట్‌గా నిలిచాయి. నాగ‌చైత‌న్య‌కు `యుద్ధం శ‌ర‌ణం`, అఖిల్‌కు `అఖిల్‌`, `హ‌లో` చిత్రాలు బిట్ట‌ర్ రిజ‌ల్ట్స్ ఇచ్చాయి. సుమంత్‌కు `మ‌ళ్ళీ రావా` మంచి జాబ్ శాటిస్‌ఫ్యాక్ష‌న్ ఇస్తే.. సుశాంత్‌ను `ఆటాడుకుందాం రా` బాగా డిజ‌ప్పాయింట్ చేసింది. అయితే.. ఆ ఫెయిల్యూర్స్‌ను `పార్ట్ ఆఫ్ ది గేమ్‌`గా తీసుకున్నారే త‌ప్ప ఎవ‌రూ కుంగిపోలేదు. ఎవ‌రూ ప‌ని మానేయ‌లేదు. అందుకే.. 2018 సెకండాఫ్‌లో నెల‌కు ఒక‌టి రెండు చొప్పున అక్కినేని కాంపౌండ్‌లోని ప్ర‌తి హీరో నుండి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంతేగాకుండా.. హీరోయిన్‌గా టాప్ ర్యాంక్‌లో ఉన్న అక్కినేని వారి కోడ‌లు స‌మంత కూడా ఫుల్ బిజీ. ఇక‌.. `అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి` త‌రువాత సుప్రియ దాదాపు 21 ఏళ్ళ త‌రువాత మ‌ళ్ళీ మేక‌ప్ వేసుకోవ‌డం విశేషం. సో.. 2018 ద్వితీయార్థంలో దుమ్ము రేప‌నున్న అక్కినేని కాంపౌండ్ సినిమాల వివ‌రాలు చూద్దాం.

* నాగార్జున చిన్న మేన‌ల్లుడు సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిత‌మైన `చి ల సౌ` జూలై 27న రిలీజ్ కానుంది.
* అక్కినేని కాంపౌండ్‌లో `ఫైర్ బ్రాండ్ లేడీ`గా గుర్తింపు పొందిన నాగార్జున మేన‌కోడ‌లు సుప్రియ‌.. శ‌శికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `గూఢ‌చారి` చిత్రంలో ఓ కీ రోల్ పోషించారు. ఈ సినిమా ఆగ‌స్టు 3న విడుద‌ల కానుంది.
* ఇక `ప్రామిసింగ్ యంగ్ స్టార్‌ ఆఫ్ అక్కినేని కాంపౌండ్` నాగ‌చైత‌న్య.. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో చేసిన `స‌వ్య‌సాచి` ఆగ‌స్టు 17న‌.. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో చేసిన `శైల‌జా రెడ్డి అల్లుడు` ఆగ‌స్టు 31న గానీ సెప్టెంబ‌ర్ మొద‌టివారంలోగానీ రిలీజ్ కావ‌చ్చు. సో.. నాగ‌చైత‌న్య‌కు నెల రోజుల గ్యాప్‌లో రెండు సినిమాలు విడుద‌ల కావ‌డం విశేషం.
*ఇక ఇటీవ‌ల విడుద‌లైన `మ‌ళ్ళీ రావా`తో ఫామ్‌లోకి వ‌చ్చిన సుమంత్‌.. అనిల్ శ్రీ‌కంఠం ద‌ర్శ‌క‌త్వంలో చేసిన `ఇదం జ‌గ‌త్` సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ కావ‌చ్చు. అలాగే సంతోష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న త‌న 25వ సినిమా `సుబ్ర‌హ్మ‌ణ్య పురం` న‌వంబ‌ర్‌లో రిలీజ్ కావ‌చ్చు.
* ఇక `సెంట్ర‌ల్ స్టార్ ఆఫ్ అక్కినేని కాంపౌండ్` నాగార్జున.. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో నానితో స్క్రీన్ షేర్ చేసుకున్న `దేవ‌దాస్` సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ కానుంది.
*ఇక `వ‌న్ ఆఫ్ ద టాప్ హీరోయిన్స్ ఆఫ్ టాలీవుడ్` స‌మంత‌.. ప‌వ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న `యు ట‌ర్న్` సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్‌లో రిలీజ్ కావ‌చ్చు. ఇవి కాకుండా త‌మిళంలో చేస్తున్న మ‌రో రెండు సినిమాలు ఈ ఇయ‌ర్ ఎండింగ్‌లో రిలీజ్ కావ‌చ్చు.
* స‌రైన స‌క్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ అక్కినేని.. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమాకు `మిస్ట‌ర్ మ‌జ్ను` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఈ సినిమా డిసెంబ‌ర్‌లో విడుద‌ల కావ‌చ్చు.

ఇవీ.. అక్కినేని కాంపౌండ్ నుంచి 2018 ద్వితీయార్థంలో రాబోతున్న చిత్రాల వివ‌రాలు. ఇలా ఒకే కాంపౌండ్ నుండి ఐదుగురు హీరోలు (నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, సుమంత్‌, అఖిల్‌, సుశాంత్‌), ఇద్ద‌రు హీరోయిన్లు (సుప్రియ‌, స‌మంత‌) `ఆన్ జాబ్` ఉండ‌డం అరుదైన విశేషం.ఈ జాబితాలో అక్కినేని అమ‌ల కూడా ఉండి ఉంటే.. ఫుల్ కాంపౌండ్ `ఆన్ జాబ్` అన్న‌ట్లు నిండుగా ఉండేది. మొత్తానికి.. 2018 సెకండాఫ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నున్న అక్కినేని కాంపౌండ్‌కు ఆల్ ద బెస్ట్‌.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here