‘దేవదాసు’ నేపథ్యగాయని కె.రాణి ఇక లేరు

Senior Singer K Rani is No More, Devadas Movie Singer Passed Away, Singer K Rani Passes Away, Telugu FilmNagar, Latest Tollywood Updates, Tollywood Celebrities Latest News, Telugu Film News 2018,
Senior Singer K Rani No More

అలనాటి మేటి సినీ నేపథ్య గాయని కె.రాణి (75) ఇకలేరు.. హైదరాబాద్ కళ్యాణ్ నగర్‌లోని తన పెద్ద కుమార్తె విజయ ఇంట రాత్రి 9.10 నిముషాలకు కన్నుమూశారు. ఈ విషయాన్ని రాణి చిన్న కుమార్తె కవిత ధృవీకరించారు. 7 ఏళ్ళ‌ వయసులో సినీరంగ నేపథ్యగాయనిగా ‘పరమానందయ్య శిష్యులు’(1950) సినిమాతో అరంగేట్రం చేసారు. ‘దేవదాసు’(1953) చిత్రంలో “అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా”, “చెలియ లేదు చెలిమి లేదు” లాంటి విషాదకరమైన పాటలతో పాటు.. ‘లవకుశ’(1963)లో “అశ్వమేధయాగానికి జయము జయము”, “జయ జయ రామా.. శ్రీ రామ పరంధామా” లాంటి పలు విజయవంతమైన పాటలతో శ్రోతలను అలరించారు.

తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 500 పాటలతో తన గాత్ర మాధుర్యాన్ని శ్రోతలకు పంచారు. 1951 నుంచి గాలివీటి సీతారామిరెడ్డిని వివాహం చేసుకునే వరకూ పాటలు పాడుతూ వ‌చ్చిన ఈమెకు.. శ్రీలంక జాతీయగీతం ఆలపించిన ఘనత కూడా దక్కింది. “ఇన్నిసయ్ రాణి” అని అప్పటి జాతీయ కాంగ్రెస్ నేత కె.కామరాజ్‌ ఆమెని కీర్తించారు. భారత రాష్ట్రపతి భవన్‌లో.. అప్పటి రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ తదితరులను ఆమె తన గానామృతంతో ఓలలాడించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here