బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ ఎన్టీఆర్?

Jr NTR Latest News, Jr NTR To Enter Bollywood?, NTR Jr Entry in Bollywood, NTR Making Bollywood Entry, NTR Next Movies, Tarak Ready For bollywood Entry, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Celebrity News, Tollywood Updates 2018
Jr NTR to enter Bollywood?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫైట్స్‌కి, డ్యాన్స్‌కి ఫిదా అయిపోయే ఫ్యాన్స్ టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ ఉన్నారు. అలా ఎన్టీఆర్‌కి ఫిదా అయిపోయిన బాలీవుడ్ ఫ్యాన్స్‌లో.. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఒకరు. ఈ విషయాన్ని తన అభిమానులతో స్వయంగా పంచుకున్నారు వరుణ్. తాజాగా.. మీరిద్దరూ కలిసి ‘రణ్‌భూమి’లో కలిసి నటించే అవకాశం ఉందా? అని సోషల్ మీడియా ద్వారా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు వరుణ్ బదులిస్తూ.. అవునని స్ట్రెయిట్‌గా సమాధానం చెప్పకపోయినా.. కలిసి నటించడం ఖాయమని చెప్పకనే చెప్పారు. అయితే ఇటువంటి విషయాలను డైరెక్టర్ శశాంక్‌ను అడిగితే బాగుంటుందని ట్వీట్ చేయడంతో.. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖాయమని.. ‘రణ్‌భూమి’తో తార‌క్‌ బాలీవుడ్ ఆడియన్స్‌కు పరిచయం కానున్నట్టేన‌ని తెలుస్తోంది.

అయితే.. టాలీవుడ్‌లో హీరోగా అడుగుపెట్టి 17 సంవత్సరాలు నిండినా.. తెలుగులో తప్ప మరే ఇతర భాషల్లోనూ నటించని ఎన్టీఆర్.. ఇప్పుడు నేరుగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. ఇదిలా ఉంటే.. ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఓ మల్టీస్టారర్ మూవీలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటించనున్నారు ఎన్టీఆర్.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here