బిగ్ బాస్‌.. ఫెంటాస్టిక్ ప్లాట్‌ఫాం

NTR About Big Boss Season 2, Jr NTR Comments Bigg Boss Telugu, Jr NTR Press Meet about Celekt Mobiles, NTR Jr at Celekt Mobile Store Launch, Tarak Speech at Celekt Mobiles Brand Launch, NTR Speaks About Nani Hosting In Big Boss, Telugu FilmNagar, Tollywood Celebrity News, Young Tiger NTR Interview, Tollywood Updates 2018, Celekt Mobile Brand Launch Event
NTR about BigBoss season 2

`సెలెక్ట్` మొబైల్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒప్పందం కుదుర్చుకున్న‌ విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి శుక్ర‌వారం జ‌రిగిన మీడియా స‌మావేశంలో.. విలేఖ‌రులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు తార‌క్ స‌మాధాన‌మిచ్చారు. అందులో భాగంగా.. `బిగ్ బాస్ సీజ‌న్ 2` గురించి స్పంద‌న అడగ్గా.. `బిగ్ బాస్` చాలా మంచి ప్రోగ్రాం అని, ఫెంటాస్టిక్ అండ్ స‌క్సెస్‌ఫుల్‌ ప్లాట్‌ఫాం అని చెబుతూనే.. నాని మంచి యాక్టర్ అని.. నేచురల్ స్టార్ అని.. తను గ్రేట్ జాబ్ చేస్తున్నార‌ని.. షోని చ‌క్క‌గా డీల్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. తామే కాదు ఎవ‌రూ చేసినా ఈ షోని ర‌క్తి క‌ట్టించేలా ఆ పోగ్రామ్ డిజైన్ చేయ‌బ‌డింద‌ని తార‌క్ అభిప్రాయ‌ప‌డ్డారు.

గ‌తేడాది ప్ర‌సార‌మైన `బిగ్ బాస్` మొద‌టి సీజ‌న్‌కు ఎన్టీఆర్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఆ షో.. అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇక‌.. ఈ ఏడాది `బిగ్ బాస్` సెకండ్ సీజ‌న్‌ నేచుర‌ల్ స్టార్ హోస్ట్‌గా ప్రారంభ‌మై.. విజ‌య‌ప‌థంలో దూసుకుపోతోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here