సొంత గొంతుక‌లో బెస్ట్ హీరోయిన్‌ ఎవ‌రు?

Which Heroine Dubbing Has been The Best, 7 Tollywood Actresses Whose Voices Were Dubbed For Their Films, Samantha Own Dubbing For Mahanati, Keerthy Suresh dubs in own voice, Telugu FilmNagar, Latest Telugu Film News, Telugu movie News 2018, Tollywood Cinema Updates
Which Heroine Dubbing Has been The Best?

ప‌ర‌భాషా హీరోయిన్లతో మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప‌డే పాట్లు, చేసే ఫీట్లు చూస్తే న‌వ్వొస్తుంది.. జాలి వేస్తుంది.. కానీ త‌ప్ప‌దు. హీరోయిన్ల కొర‌త ఈనాటిది కాదు. 50, 60 ద‌శ‌కాల నుండే ప‌ర‌భాషా హీరోయిన్లతో ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారు మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ముఖ్యంగా భాషాప‌ర‌మైన ఇబ్బందిని అధిగ‌మించ‌డం పెద్ద స‌వాల్ అవుతోంది. ఎక్స్‌ప్రెష‌న్ వ‌స్తే డైలాగ్ మిస్స‌వడం.. డైలాగ్ వ‌స్తే ఎక్స్‌ప్రెష‌న్ మిస్ అవ‌డం.. త‌రువాత ఎడిటింగ్ రూమ్‌లో నాన్ సింక్‌తో ఎడిటర్లు కుస్తీలు ప‌ట్ట‌డం.. ద‌శాబ్దాలుగా సాగుతున్న తంతే ఇది

అదలా ఉంచితే.. ఒక హీరోయిన్ ఎంత గొప్ప‌గా న‌టించిన‌ప్ప‌టికీ డ‌బ్బింగ్ వేరే వాళ్ళ‌తో చెప్పించ‌డం వ‌ల్ల ప్ర‌భుత్వ అవార్డుల‌కు అన‌ర్హం అవుతారు. అందువ‌ల్ల ఉత్త‌మ న‌టి అవార్డుకు నోచుకోని ఉత్త‌మోత్త‌మ న‌టీమ‌ణులు చాలా మంది ఉన్నారు. మంచి మంచి పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌కుల రివార్డులు సంపాదించినప్ప‌టికీ ప్ర‌భుత్వ అవార్డుల‌కు అన‌ర్హం కావ‌డం హీరోయిన్ల‌ను నిరాశ‌కు గురిచేస్తుంది. అంతేగాకుండా.. త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకుంటే ఆ ఆర్టిస్ట్‌కు వ‌చ్చే సంతృప్తే వేరు. సొంత గొంతుక అయిన‌ప్పుడే పాత్ర‌కు ఓ ప‌రిపూర్ణ‌త చేకూరుతుంది. అందుకే ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు త‌మ సొంత గొంతు వినిపిస్తున్నారు. భాష రాక‌పోయినా.. భావం తెలియ‌క‌పోయినా.. ప‌ట్టుబ‌ట్టి సాధ‌న చేసి `ఓన్ వాయిస్‌`తో వండ‌ర్ చేస్తున్నారు. అలా తాము చేసిన పాత్ర‌ల‌కు తామే డ‌బ్బింగ్ చెప్పుకునే ప‌ర‌భాష హీరోయిన్ల సంఖ్య ఈ మ‌ధ్య కాలంలో బాగా పెరిగింది. ఇలా సొంత గొంతుక‌తో సంచ‌ల‌నం సృష్టించిన హీరోయిన్ల‌లో మీకు బాగా న‌చ్చిన‌, మీరు మెచ్చిన `స్వీట్ వాయిస్` ఎవ‌రిది? ఎక్స్‌ప్రెష‌న్స్‌లో, డైలాగ్ సింకనైజింగ్‌లో ఎవ‌రు ప‌ర్‌ఫెక్ట్ అనిపించింది? అన్న‌ది ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన చ‌ర్చ‌నీయాంశం.

2018లో తొలి సారి సొంత గొంతుతో మెప్పించిన కొంత‌మంది సీనియ‌ర్ మ‌రియు లేటెస్ట్ హీరోయిన్ల‌ను పోల్ గేమ్‌కు నామినేట్ చేస్తోంది `తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్‌.కామ్‌`. మ‌న తెలుగును మ‌న క‌ళ్ళ ముందే ఖూనీ చేయ‌కుండా భాషా, భావం, ఉచ్ఛార‌ణ‌ ఉత్త‌మంగా అనిపించిన `సొంత గొంతు సొగ‌స‌రి` అన్న‌ది తేల్చ‌డ‌మే ఈ పోల్ గేమ్ ఉద్దేశం. సో.. కింద ఇచ్చిన జాబితా నుండి `సొంత గొంతుక‌లో బెస్ట్ హీరోయిన్ ఎవ‌రు?` అన్న‌ది మీ ఓటు ద్వారా మీరే నిర్ణ‌యించండి.

సొంత గొంతుక‌లో బెస్ట్ హీరోయిన్‌ ఎవ‌రు?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here