ఐ.ఎఫ్.ఎఫ్.ఎం.లో రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి

Rangasthalam And Mahanati At IFFM,Telugu Filmnagar,Telugu movie News 2018,Tollywood Cinema Updates,Latest Telugu Movies News,Indian Film Festival of Melbourne Awards 2018,Rangasthalam And Mahanati At IFFM Nominated at IFFM 2018,Rangasthalam And Mahanati At Indian Film Festival of Melbourne,IFFM Awards 2018
Rangasthalam And Mahanati At IFFM

రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ప్రేక్షకులను అలరించే కొన్ని భారతీయ సినిమాలకు.. ప్రతీ ఏటా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌(ఐ.ఐ.ఎఫ్.ఎం) పేరిట అవార్డుల ప్రదానోత్సవం జరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది కూడా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఈ వేడుక జరుగనుంది. ఈ వేడుకలో పోటీ పడేందుకు టాలీవుడ్ నుంచి ‘రంగస్థలం’, ‘మహానటి’ సినిమాలు ఎంపిక‌య్యాయి.

ఆగష్టు 10 నుంచి 22 వరకు జరిగే ఈ వేడుకల్లో ‘ఉత్తమ చిత్రం’ విభాగంలో ‘రంగస్థలం’ చిత్రం పోటీకి సై అంటోంది. ఈ మేరకు రామ్ చరణ్‌కు ఆహ్వానం కూడా అందింద‌ని స‌మాచారం. ఈ సినిమా ప్రదర్శన జరిగే రోజున చరణ్ ఆస్ట్రేలియాలో ఉండేట్టు ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌. మరోవైపు అభినేత్రి సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా కూడా ‘ఉత్తమ చిత్రం’ అవార్డుల బ‌రిలో ఉంది. అలాగే.. ‘ఉత్తమ నటి’ కేట‌గిరిలో కీర్తి సురేష్ (సావిత్రి పాత్రధారిణి), ‘ఉత్తమ సహాయ నటి’ కేట‌గిరిలో సమంత (మధురవాణి పాత్రధారిణి) నామినేట్ అయ్యారు.

తెలుగు సినీ ప్రియులను అలరించిన ఈ రెండు సినిమాలు.. ఆస్ట్రేలియాలో ఏ మేర అవార్డుల పంటను పండిస్తాయో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here