లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ పాత్ర‌లో ప్ర‌కాష్ రాజ్‌?

Prakash Raj to Play B Nagi Reddy In NTR Biopic, Actor Prakash Raj As B Nagireddy, #NTR Biopic Prakash Raj's Role Revealed, Balakrishna NTR Biopic Latest News, NTR Biopic Cast, Popular character artist as Nagi Reddy, Telugu FilmNagar, Telugu Movie News 2018, Tollywood Cinema Updates
Prakash Raj to Play B Nagi Reddy In NTR Biopic

మహానటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. నంద‌మూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించుకున్న‌ ఈ సినిమాలో.. అలనాటి లెజెండరీ డైరెక్టర్స్, నటుల పాత్రలో ప్ర‌ముఖ‌ తారలు మెరుస్తున్నారు.

కాగా.. ఇప్పటికే మహానటి సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో చక్రపాణి పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్.. ఎన్టీఆర్ బయోపిక్‌లో కూడా ఓ కీల‌క పాత్ర‌లో కనిపించనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్‌తో ‘షావుకారు’, ‘పాతాళ భైరవి’, ‘మిస్సమ్మ’, ‘మాయాబజార్’, ‘గుండమ్మకథ’ లాంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన విజయా వాహిని స్టూడియోస్ అధినేత, లెజెండరీ ప్రొడ్యూసర్ బి.నాగిరెడ్డి పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ త‌న‌ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు.

వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here