ఇంద్రగంటి, ‘దిల్’ రాజు కాంబినేష‌న్‌లో యాక్షన్ థ్రిల్లర్

Dil Raju And Mohan Krishna Indraganti Collaborate for an Action Thriller, Dil Raju to produce Indraganti’s multistarrer, Indraganti joins hands with Dil Raju, Indraganti Mohan Krishna Multistarrer Movie, Producer Dil Raju Next Multistarrer, Telugu Filmnagar, Telugu movie News 2018, Tollywood Cinema Updates
Dil Raju And Mohan Krishna Indraganti Collaborate for an Action Thriller

ఫీల్ గుడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన‌ దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. ‘గ్రహణం’, ‘అష్టా చమ్మా’, ‘అంతకుముందు ఆ తరువాత’, ‘జెంటిల్‌మన్’, ‘అమీతుమీ’ లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు.. తాజాగా ‘సమ్మోహనం’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం తన తదుపరి చిత్రం కోసం.. తొలిసారి ఓ యాక్షన్ థ్రిల్లర్ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నారు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌.

ఈ చిత్రాన్ని.. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మించ‌నున్నారు. ఈ విష‌యాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థకు సంబంధించిన‌ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు. మల్టీస్టారర్ మూవీగా రూపుదిద్దుకోబోయే ఈ సినిమాకి సంబంధించి.. నటీనటుల వివరాలతో బాటు మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడించనున్నట్టు ఈ  ట్వీట్‌లో పోస్ట్ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here