‘అర్జున్ రెడ్డి’ సంచలన విజయంతో యూత్ ఐకాన్‌గా పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం.. విజయ్ నటించిన ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టేజ్‌లో ఉండగా.. ద్విభాషా చిత్రం ‘నోటా’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అలాగే.. ఇటీవలే భరత్ కమ్మ అనే నూతన దర్శకుడి కాంబినేషన్లో ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రాన్ని ప్రారంభించారు విజయ్.
ఇదిలా ఉంటే.. ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ చిత్రాల దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్.రామారావు నిర్మించనున్నారు. యూరప్ నేపథ్యంలో సాగే ఈ కుటుంబ కథా చిత్రంలో విజయ్ దేవరకొండ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. మరి.. ఈ వార్తల్లో ఎంత నిజముందో త్వరలోనే క్లారిటీ వస్తుంది.
కాగా.. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటించే అవకాశముందని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా తెరపైకి రానుంది.
