వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య.. మ‌ల్టీస్టార‌ర్ షురూ

Venkatesh And Nag Chaitanya Multi Starrer Movie Launched, Venkatesh-Naga Chaitanya Multi Starrer, Venky Mama Movie Launch, Chaitanya And Venky Multistarrer Movie Lauch, Venky Mama Telugu Movie Latest Update, Telugu FilmNagar, Rakul Preet Upcoming Movie with Naga Chaitanya, Telucu Cinema News, Telugu Film Latest Updates
Venkatesh Naga Chaitanya Multistarrer Begins

విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కథానాయకులుగా యువ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ రానున్న‌ విషయం తెలిసిందే. సురేష్ బాబు, కోన వెంకట్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు ఈ రోజు (బుధ‌వారం) హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జ‌రిగాయి. వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య‌తో పాటు ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వీంద్ర‌, నిర్మాత సురేష్ బాబు, కోన వెంక‌ట్‌, రానా ద‌గ్గుబాటి, వి.వి.వినాయ‌క్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. కాగా.. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

`వెంకీ మామ` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ న‌టించ‌నున్నారు. `రారండోయ్ వేడుక చూద్దాం` త‌రువాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఇదే కావ‌డం విశేషం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here