నిన్న మ‌హాన‌టి.. నేడు య‌న్‌.టి.ఆర్‌?

Actor Naresh entry in Ntr biopic, Latest Movie Updates 2018, Naresh in #NTRBiopic, Naresh to play BA Subba Rao, NTR Biopic Cast, NTR Biopic Latest Updates, Senior Actor Naresh Role In NTR Biopic, Telugu Cinema News, Telugu Filmnagar
Senior Actor Naresh Role In NTR Biopic

‘దృశ్యం, ఛ‌లో, తొలిప్రేమ‌, రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, స‌మ్మోహ‌నం’.. ఇలా సెకండ్ ఇన్నింగ్స్‌లో అర్థ‌వంత‌మైన పాత్ర‌ల‌తో దూసుకుపోతున్నారు సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌. తాజాగా ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌.. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప్రాజెక్ట్‌లో భాగ‌మ‌య్యేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని తెలిసింది.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. మ‌హాన‌టుడు, దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న ‘య‌న్‌.టి.ఆర్’ బ‌యోపిక్‌లో న‌రేష్ ఓ ముఖ్య‌మైన పాత్ర చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. ఎన్టీఆర్‌కు ‘ప‌ల్లెటూరి పిల్ల’ చిత్రం ద్వారా క‌థానాయ‌కుడిగా తొలి అవ‌కాశ‌మిచ్చిన ద‌ర్శ‌క‌ నిర్మాత బి.ఎ.సుబ్బారావు పాత్ర‌లో న‌రేష్ క‌నిపించ‌నున్నార‌ట‌. త్వ‌ర‌లోనే న‌రేష్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ‘మ‌హాన‌టి’ బ‌యోపిక్‌లో భాగ‌మైన న‌రేష్‌కు.. ఇప్పుడు మ‌హాన‌టుడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌లోనూ భాగ‌మ‌య్యే అవ‌కాశం ద‌క్క‌డం అపురూప‌మైన విష‌య‌మే.

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న ఈ బ‌యోపిక్‌కు క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా తెర‌పైకి రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here