‘అఆ’ , ‘జనతా గ్యారేజ్’, ‘రాజు గారి గది 2’, ‘మెర్సల్’ (అదిరింది),‘రంగస్థలం’, ‘మహానటి’, ‘అభిమన్యుడు’.. ఇలా వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు అందాల నటి సమంత. ఇటీవలే.. తన తదుపరి చిత్రాలైన ‘యు టర్న్’ (తెలుగు, తమిళ్), ‘సీమ రాజా’ (తమిళ్), ‘సూపర్ డీలక్స్’ (తమిళ్) చిత్రాలకు సంబంధించి తన షూటింగ్ పార్ట్‌ను కంప్లీట్ చేశారు. అంతేగాకుండా.. ఈ మూడు సినిమాలకు సంబంధించిన డబ్బింగ్ వర్క్‌తో సామ్ బిజీ బిజీగా ఉన్నారు. ఈ మూడు సినిమాలు కూడా ఈ ఏడాది ద్వితియార్థంలో నెలల గ్యాప్‌లో విడుదలకు సిద్ధమవుతున్నాయి.
ఈ సినిమాలు విడుదలయ్యే లోపే.. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్యకి జోడీగా ఓ చిత్రాన్ని.. గిరిశయ్య దర్శకత్వంలో హీరోయిన్ ఒరియెంటెడ్ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు సామ్. పెళ్ళయినా.. కథానాయికగా సమంత జోరు ఏ మాత్రం తగ్గలేదనడానికి.. ఈ సినిమాలే నిదర్శనం.
