ప్ర‌తి బెస్ట్ డెబ్యూ అవార్డు ఆ హీరోయిన్‌దే అంటున్న స‌మంత‌

Samantha About Debut Heroine Ruhani Sharma, Samantha Comments on Chi La Sou Movie, Akkineni Samantha Release Chi La Sow Bride Teaser, Chi La Sow Telugu Movie Updates, Latest Telugu Film News, Telugu FilmNagar, Telugu movie News 2018, Tollywood Cinema Updates
Samantha About Debut Heroine Ruhani Sharma
సుశాంత్, రుహాని శ‌ర్మ జంట‌గా నటించిన చిత్రం ‘చి ల సౌ’. యువ క‌థానాయ‌కుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ చిత్రాన్ని సిరుని సినీ కార్పొరేషన్ సంస్థ నిర్మించ‌గా.. ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చెయ్యనుంది. ప్ర‌శాంత్ విహారి సంగీతమందించిన ఈ సినిమా.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. ఈ నెల 27న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా చూసిన న‌టి స‌మంత‌.. ట్విట్ట‌ర్‌లో ఈ సినిమా హీరోయిన్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ”ఈ సినిమా చూశా.. ప్ర‌తి బెస్ట్ డెబ్యూ అవార్డు నీకే వ‌స్తుంద‌ని న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌ల‌ను” అంటూ రుహాని శ‌ర్మ‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా వ‌ధువు వెర్ష‌న్‌కు సంబంధించిన టీజ‌ర్‌ను స‌మంత విడుద‌ల చేశారు.

వెన్నెల కిషోర్, జయ ప్రకాష్, సంజయ్ స్వరూప్, రోహిణి, అను హాసన్, రాహుల్ రామకృష్ణ, విద్యుల్లేఖ‌ రామన్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి ఛాయాగ్ర‌హ‌ణం: ఎం.సుకుమార్‌, ఎడిట‌ర్‌: చోటా కె.ప్ర‌సాద్‌, క‌ళ‌: వినోద్ వ‌ర్మ‌, నిర్మాతలు: జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here