RX 100 చిత్ర నిడివి ఎంతంటే..

RX 100 Movie Run Time, RX 100 Duration, Latest Telugu Movie RX 100 Updates, RX 100 Censor Review, Telugu FilmNagar, Telugu Cinema News, Latest Tollywood Updates, #RX100, Upcoming Telugu Movies 2018
RX 100 Movie Run Time
కార్తికేయ, పాయల్ రాజ్‌పుట్ జంటగా నటించిన చిత్రం ‘ RX 100’ . యాన్ ఇన్‌క్రెడిబుల్ ల‌వ్‌స్టోరీ అనేది దీనికి ఉప‌శీర్షిక‌. రామ్ గోపాల్ వ‌ర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమాని కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ ప‌తాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. రావు రమేష్, ‘సింధూర పువ్వు’ రామ్‌కీ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి చైత‌న్ భ‌రద్వాజ్ సంగీతమందించారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది.
అలాగే ”మ‌ర‌చిపోవ‌డానికి నా ప్రేమ చావు పుట్టుక‌ల్లాంటిది కాదు.. స‌ముద్రంలో అల‌ల్లాంటిది”, ”శివా.. రొమాన్స్ అంటే పెయిన్ ఉండాలి”.. వంటి ఇంటెన్స్ డైలాగ్స్‌తో, రియ‌లిస్టిక్ అప్రోచ్‌తో కూడిన‌ మేకింగ్‌తో, ఎక్స్‌ట్రార్డ‌న‌రీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఇటీవ‌ల విడుద‌లైన‌ ‘ RX 100’ ట్రైల‌ర్‌కు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.
రేపు (గురువారం) ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. 153 నిమిషాల (2 గంట‌ల 33 నిమిషాల‌) పాటు ఈ సినిమా ర‌న్ టైమ్ ఉంటుంద‌ని స‌మాచారం. పాట‌లు, ట్రైల‌ర్స్‌తో యువ‌త‌ను అల‌రిస్తున్న ఈ సినిమా..  ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో తెలియాలంటే రేప‌టి వర‌కు వేచి చూడాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here