ర‌కుల్ ప్రీత్ సింగ్.. సూప‌ర్ ఎగ్జైటింగ్‌

Rakul Preet Singh is an Entertainer,Rakul Preet Upcoming Movie News,Telugu Filmnagar,Upcoming Telugu Movies 2018,Latest Telugu Movie Updates,Actress Rakul Preet Singh Latest News,Rakul Preet Singh Next Movie Updates,Rakul Preet New Movies
Rakul Preet Singh is an Entertainer

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. త‌క్కువ కాలంలోనే తెలుగు నాట స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఉత్త‌రాది భామ‌. దాదాపు ఈ త‌రం అగ్ర హీరోలంద‌రితోనూ ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ‌.. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌ మ‌ల్టీస్టార‌ర్ మూవీలో కూడా సంద‌డి చేసిన సంద‌ర్భం లేదు. అయితే.. ఈ రోజు (బుధ‌వారం) ప్రారంభ‌మైన ‘వెంకీ మామ‘ (వ‌ర్కింగ్ టైటిల్‌)తో ఆ లోటు కూడా తీరిపోనుంది.

నిజ‌జీవితంలో మామా అల్లుళ్ళైన వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య.. తెర‌పైనా మామ అల్లుళ్ళ పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్న ఈ సినిమాలో.. చైత‌న్య‌కి జోడీగా ర‌కుల్ క‌నిపించ‌నున్నారు. వేరే షూటింగ్‌లో ఉండి ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి రాలేక‌పోయిన ర‌కుల్‌.. తాజాగా ఈ సినిమా గురించి ఓ ట్వీట్ వేశారు. ఈ ఫ‌న్ రైడ్‌లో భాగ‌మ‌వుతున్నందుకు సూప‌ర్ ఎగ్జైటింగ్‌గా ఉంద‌ని ర‌కుల్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు.

‘రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి విజ‌య‌వంత‌మైన సినిమా త‌రువాత చైతూతో ర‌కుల్ న‌టిస్తున్న ఈ సినిమా కూడా విజ‌యం సాధిస్తుందేమో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here