హైద‌రాబాద్‌లో ప్ర‌భాస్‌ సాహో 

Prabhas Sahoo Shoot Begins in Hyderabad, Sahoo Team Begins Hyderabad Schedule, Prabhas Next Movie, Prabhas Latest News, Sahoo Movie Shooting Details, Sahoo Shooting Schedule, Telugu FilmNagar, Telugu Cinema News, Latest Movie Updates 2018, Indian Film News
Prabhas Sahoo Shoot Begins in Hyderabad

‘బాహుబ‌లి ద బిగినింగ్‌’, ‘బాహుబ‌లి ది కంక్లూజ‌న్’ వంటి సెన్సేష‌న‌ల్ హిట్స్ త‌రువాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘సాహో’. బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో త్రిభాషా చిత్రంగా తెర‌కెక్కుతోంది. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేష‌న్స్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది. ఇటీవ‌లే అబుదాబిలో సెకండ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ఈ రోజు (జూలై 11) నుంచి హైద‌రాబాద్‌లో తాజా షెడ్యూల్ ప్రారంభించుకున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ యు.వి.క్రియేష‌న్స్ ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించింది. సినిమాకి సంబంధించిన చాలా కీల‌క‌మైన షెడ్యూల్ ఇద‌ని స‌ద‌రు నిర్మాణ సంస్థ పేర్కొన‌డం విశేషం.

నీల్ నితిన్ ముఖేష్‌, ఎవ‌లెన్ శ‌ర్మ‌, లాల్‌, అరుణ్ విజ‌య్‌, మందిరా బేడి, వెన్నెల కిషోర్‌, మ‌హేష్ మంజ్రేక‌ర్‌, చుంకీ పాండే త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి శంక‌ర్-ఎహ‌సాన్-లాయ్ సంగీత‌మందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది వేస‌విలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here