80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న పందెం కోడి సీక్వెల్‌

2006లో విడుద‌లైన త‌మిళ అనువాద చిత్రం ‘పందెం కోడి’ ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. విశాల్‌, మీరా జాస్మిన్ జంట‌గా లింగు స్వామి రూపొందించిన ఈ సినిమాకి సీక్వెల్‌గా.. ‘పందెం కోడి 2’ రాబోతున్న సంగ‌తి తెలిసిందే. విశాల్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తున్న ఈ సినిమాకి ఒరిజిన‌ల్ వెర్ష‌న్ డైరెక్ట‌ర్ లింగు స్వామి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. యువన్ శంక‌ర్ రాజా సంగీత‌మందిస్తున్న ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది.

ఆగ‌స్టు నెలాఖ‌రుకి చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్తిచేసి.. విజ‌య ద‌శ‌మి కానుక‌గా అక్టోబ‌ర్ 18న ఈ సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. అభిమ‌న్యుడు త‌రువాత విశాల్‌, మ‌హాన‌టి త‌రువాత కీర్తి సురేష్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ సీక్వెల్‌పై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here