నీవెవ‌రో టీజ‌ర్ ఎప్పుడంటే..

Neevevaro Teaser Launch in Goa,Telugu Filmnagar,Telugu Movie News 2018,Latest Telugu Film News,Tollywood Cinema Updates,Neevevaro Movie Updates,Neevevaro Telugu Movie Latest News,#Neevevaro,Neevevaro Teaser Release Date Locked,Neevevaro Movie Teaser Release Date,Neevevaro Telugu Movie Teaser Release Date Confirmed,#NeevevaroTeaser
Neevevaro Teaser Launch in Goa

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ‘నీవెవ‌రో’. ల‌వ్ ఈజ్ బ్లైండ్ నాట్ ద‌ ల‌వ‌ర్.. అనేది దీనికి ట్యాగ్ లైన్‌. హ‌రినాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకి ప్ర‌ముఖ ర‌చ‌యిత కోన వెంక‌ట్ స‌మ‌ర్పకుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎం.వి.వి.సినిమా ప‌తాకంపై ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ షూటింగ్ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ నెల 15 మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల‌కు ఓ ప్ర‌త్యేక అతిథి గోవాలో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. మ‌రి.. ఆ స‌ర్‌ప్రైజ్ గెస్ట్ ఎవ‌రో తెలియాలంటే.. మ‌రో నాలుగు రోజులు వేచి చూడాల్సిందే. కాగా.. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన‌ ఈ ఫ‌స్ట్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్ సినిమాపై ఆస‌క్తి రేకెత్తించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here