ఈ నెల 19 వ‌ర‌కు నాగ్ సంద‌డి

Nagarjuna Joins Brahmastra Shooting, Nagarjuna joins Ranbir Kapoor, Amitabh Bachchan in Brahmastra, Nagarjuna to return to Bollywood after 15 years, Akkineni Nagarjuna Comeback to Bollywood, Nagarjuna and Amitabh Bachchan upcoming Movie, Nagarjuna Hindi Movie Brahmastra, Telugu Filmnagar, Latest Tollywood News, Upcoming Movies News 2018
Nagarjuna Joins Brahmastra Shooting

తెలుగునాట‌ రెండున్న‌ర ద‌శాబ్డాల‌కు పైగా అగ్ర క‌థానాయ‌కుడిగా రాణిస్తున్న కింగ్ నాగార్జున‌.. ‘షివ’ (1990) చిత్రంతో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు. ఆ త‌రువాత  ‘ఖుదాగ‌వా, ద్రోహి (అంతం), మిస్ట‌ర్ బేచారా, అంగారే, జ‌ఖ్మ్‌, అగ్నివ‌ర్ష్‌, ఎల్‌.ఒ.సి.కార్గిల్’ వంటి చిత్రాల్లో న‌టించారు నాగ్.వీటిలో ‘ద్రోహి’ చిత్రాన్ని మిన‌హాయిస్తే.. మిగిలిన అన్ని సినిమాల్లోనూ కీల‌క పాత్ర‌లు, అతిథి పాత్ర‌లు చేశారు.

ఇదిలా ఉంటే.. 15 ఏళ్ళ విరామం త‌రువాత నాగ్ ‘బ్ర‌హ్మాస్త’ అనే ఓ హిందీ సినిమాకి సంత‌కం చేసిన సంగ‌తి తెలిసిందే. దాదాపు రూ.300 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌ణ్‌బీర్‌ క‌పూర్‌, అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. ‘యే జ‌వాని హై దివాని’ ఫేమ్ అయ‌న్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సూప‌ర్ ఫాంట‌సీ మూవీ తాజా షెడ్యూల్ ఈ రోజు (బుధ‌వారం) నుంచి బ‌ల్గేరియాలో ప్రారంభించుకుంది. కాగా.. ఈ నెల 19 వ‌ర‌కు ఈ షెడ్యూల్‌లో నాగ్ కూడా పాల్గొన‌నున్నారు.
ఇక.. తెలుగులో నాగ్ న‌టిస్తున్న ‘దేవ‌దాస్’ చిత్రం సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల కానుంది. ఇందులో నేచుర‌ల్ స్టార్ నాని మ‌రో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here