స్టూడెంట్ నెం.1 సెంటిమెంట్‌తో దేవ‌దాస్‌?

Nagarjuna And Nani Devadas Movie Release Date Locked,Nagarjuna Nani Multi-starrer Film Release Date Fixed,Devadas Multistarrer Movie Release Date,Telugu Filmnagar,Upcoming Telugu Movies 2018,Nag Nani Multistarer Movie Release Date confirmed,Nagarjuna New Movies 2018

కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్‌లో ‘దేవ‌దాస్’ పేరుతో ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రాన్ని వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సి.అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్న ఈ సినిమా.. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల కాబోతున్న‌ట్లు టైటిల్ అనౌన్స్ చేసిన‌ప్పుడే చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాని సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. గ‌తంలో ఇదే తేదిన వైజ‌యంతీ మూవీస్ అనుబంధ సంస్థ స్వ‌ప్న సినిమా నిర్మించిన ‘స్టూడెంట్ నెం.1’ విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. మ‌ళ్ళీ 17 ఏళ్ళ త‌రువాత అదే తేదిన వ‌స్తున్న ఈ సినిమా కూడా స‌క్సెస్ అవుతుందేమో చూడాలి.

ఈ సినిమాలో ‘మ‌ళ్ళీ రావా’ ఫేమ్ ఆకాంక్ష సింగ్‌, ‘ఛ‌లో’ ఫేమ్ ర‌ష్మిక మంద‌న్నా క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here