మ‌హేష్ పుట్టిన రోజు కానుక‌గా.. 

Mahesh Babu 25th First Look Release Date Fixed, Mahesh Babu 25th Movie Title Announcement on August 9th, Mahesh Babu Latest News, #SSSMB 25 Movie First Look, Mahesh25 First Look Title On Mahesh Birthday, Telugu FilmNagar, Latest Telugu Movie News, Tollywood Updates 2018
Mahesh Babu 25th First Look Release Date Fixed

‘భ‌ర‌త్ అనే నేను’తో క‌థానాయ‌కుడిగా 24 చిత్రాల‌ను పూర్తిచేశారు సూపర్ స్టార్ మ‌హేష్ బాబు. ప్ర‌స్తుతం ఇంకా పేరు నిర్ణ‌యించని త‌న 25వ చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్నారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత‌లు సి.అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా.. ఈ సినిమాకి సంబంధించి 24 రోజుల పాటు సాగిన‌ డెహ్రాడూన్ షెడ్యూల్ పూర్త‌యిన‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ఈ రోజు (బుధ‌వారం) అధికారికంగా ప్ర‌క‌టించింది. కళాశాల నేప‌థ్యంలో సాగిన ఈ ఫ‌స్ట్ షెడ్యూల్‌లో మ‌హేష్‌తో పాటు చిత్ర క‌థానాయిక పూజా హెగ్డే.. కీల‌క పాత్ర‌ధారి ‘అల్లరి’ నరేష్‌పై కొన్ని ముఖ్య‌ సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌ను మ‌హేష్ పుట్టిన‌రోజుని పుర‌స్క‌రించుకుని ఆగ‌స్టు 9న విడుద‌ల చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్రసాద్ సంగీత‌మందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న తెర‌పైకి రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here