ఎస్ 4 అంటున్న కీర్తి సురేష్‌

Keerthy Suresh Upcoming Movies in Tamil, Vikram Keerthy Suresh Saamy Square Update, Keerthy Suresh Role in Seema Raja, Vishal's Sandakozhi 2 Movie Latest News, Keerthy Suresh and Vijay New Movie, Keerthy Suresh Next Movies List, Telugu Filmnagar, Upcoming Movies 2018, Kollywood Latest Updates
Keerthy Suresh Upcoming Movies In Tamil

‘మ‌హాన‌టి’ చిత్రంతో న‌టిగా కీర్తి సురేష్ రేంజ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. ఈ సినిమా త‌రువాత.. మ‌రో తెలుగు సినిమాకి సంతకం చేయ‌న‌ప్ప‌టికీ.. ఈ ఏడాదిలో ఆమె న‌టించిన త‌మిళ అనువాద చిత్రాలు బాగానే సంద‌డి చేయ‌బోతున్నాయి. ముఖ్యంగా.. వ‌చ్చే నెల నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు కీర్తి న‌టించిన నాలుగు చిత్రాలు వ‌రుస‌గా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. విక్ర‌మ్‌కు జోడీగా కీర్తి తొలి సారిగా న‌టించిన ‘సామి స్క్వేర్’ ఆగ‌స్టు 24న రిలీజ్ కానుంది. శివ‌కార్తికేయ‌న్‌, స‌మంత జంట‌గా న‌టించిన ‘సీమ‌రాజా’లో కీర్తి అతిథి పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 13న తెర‌పైకి రానుంది. అలాగే.. విశాల్, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన ‘పందెం కోడి’ సీక్వెల్ (సండైకోళి 2) అక్టోబ‌ర్ 18న తెర‌పైకి రానుంది. ఇక‌.. విజ‌య్‌, మురుగ‌దాస్ కాంబోలో వ‌స్తున్న ‘స‌ర్కార్’ చిత్రం దీపావ‌ళి కానుక‌గా నవంబ‌ర్ తొలి వారంలో రాబోతోంది.

మొత్త‌మ్మీద.. నాలుగు నెల‌ల పాటు త‌మిళ, తెలుగు భాష‌ల్లో కీర్తి హ‌వా సాగ‌నుంద‌న్న‌మాట‌. మ‌రో విశేష‌మేమిటంటే.. ఈ నాలుగు త‌మిళ చిత్రాల పేర్లు ‘ఎస్‌’తోనే మొద‌ల‌వ్వ‌డం. ఎస్‌..అంటే స‌క్సెస్ అన్న‌ట్లుగా కీర్తికి సిరీస్ ఆఫ్ స‌క్సెస్‌లు అందుతాయో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here