రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న హ‌లో గురు ప్రేమ కోస‌మే 

Hello Guru Prema Kosame Release Date Confirmed, Hello Guru Prema Kosame Movie release date, Ram's Hello Guru Prema Kosame Release Date Fixed, Ram Pothineni Hello Guru Prema Kosame Movie, Telugu FilmNagar, Tollywood Latest Updates, Telugu Cinema News,
Hello Guru Prema Kosame Release Date Confirmed

ఎన‌ర్జిటిక్ స్టార్‌ రామ్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘హ‌లో గురు ప్రేమ కోస‌మే’. కేర‌ళ‌ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, క‌న్నడ బ్యూటీ ప్ర‌ణీత క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ సినిమాకి.. ‘సినిమా చూపిస్త మావ‌’, ‘నేను లోక‌ల్’ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ విజ‌యాల‌ను అందుకున్న త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాని విజ‌య ద‌శ‌మి కానుక‌గా అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, ఆమ‌ని ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here