హ్యాపి వెడ్డింగ్ ఎప్పుడంటే..

#HappyWedding, #HappyWeddingOnJuly28th, Happy Wedding Movie Release Date Confirmed, Happy Wedding Movie Updates, Happy Wedding Release Date Fixed, Happy Wedding Telugu Movie Latest News, Happy Wedding Telugu Movie Release Date Locked, Latest Telugu Film News, Telugu Filmnagar, Telugu movie News 2018, Tollywood Cinema Updates
Happy Wedding Movie Release Date Confirmed

సుమంత్ అశ్విన్‌, నిహారిక కొణిదెల హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్‌’. ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మవుతున్న ఈ చిత్రాన్ని పాకెట్ సినిమా, యు.వి క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎం.సుమంత్ రాజు నిర్మించారు. ‘ఫిదా’ ఫేమ్ శ‌క్తికాంత్ కార్తిక్ సంగీతమందించిన ఈ చిత్రానికి యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ నేప‌థ్య సంగీత‌మందించారు. పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జ‌రిగేరోజు వ‌ర‌కు రెండు కుటుంబాల మధ్య, రెండు మ‌న‌సుల మ‌ధ్య ఏం జ‌రిగింద‌నే క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాని జూలై 28న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన యు.వి క్రియేష‌న్స్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తున్న నేప‌థ్యంలో.. ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here