ఇది ఎఫ్ 2 ఫ్యామిలీ

F2 Family Photo, Venkatesh, Varun Tej Come Together For Anil Ravipudi’s #F2, Tamanna, Mehreen Joined The Sets Of F2, #FunAndFrustration, Venkatesh Varun Tej Tamannaah Mehreen And AnilRavipudi on the sets of F2, F2 Movie Latest News, Telugu FilmNagar, Telugu Film News, Tollywood Latest News 2018, Latest Telugu Movie Updates
F2 Family Photo

విక్ట‌రీ వెంక‌టేష్‌ ఫ్యాన్స్‌తో పాటు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌ ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ‘ఎఫ్ 2’. హ్యాట్రిక్ విజ‌యాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాని స‌క్సెస్‌ఫుల్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది. కాగా.. ఇటీవ‌లే ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైన సంగతి తెలిసిందే.

తొలుత వ‌రుణ్ తేజ్ అండ్ కో ఈ షూటింగ్‌లో భాగం కాగా.. రెండు రోజుల క్రితం వెంకీ కూడా జాయిన్ అయ్యారు. తాజాగా.. చిత్ర క‌థానాయిక‌లు త‌మ‌న్నా, మెహ‌రీన్ కూడా చిత్రీక‌ర‌ణ‌లో పాలుపంచుకున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలియ‌జేశారు. వెంకీ, వ‌రుణ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్‌తో పాటు టీమ్ దిగిన ఫొటోకి ‘ఎఫ్ 2 ఫ్యామిలీ’ అనే ట్యాగ్ జోడించి ఈ ట్వీట్ చేశారు.

దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here