ఎన్టీఆర్ ఎక్స్‌-గ‌ర్ల్‌ఫ్రెండ్‌గా ఈషా రెబ్బా?

Eesha Rebba To Play Jr Ntr Ex Girl Friend in Aravinda Sametha, Eesha Rebba Role in Aravinda Sametha, Aravinda Sametha Veera Raghava Movie Updates, Actress Eesha Rebha Reveals her Role in NTR's Movie, Telugu FilmNagar, Telugu Film News, Tollywood Latest News 2018, Latest Telugu Movie Updates
Eesha Rebba To Play Jr Ntr Ex Girl Friend in Aravinda Sametha
‘అంత‌కుముందు ఆ త‌రువాత’ చిత్రంతో క‌థానాయిక‌గా తొలి అడుగులు వేసిన అచ్చ తెలుగ‌మ్మాయి ఈషా రెబ్బా.. ఆ త‌రువాత ‘బందిపోటు, అమీ తుమీ, ద‌ర్శ‌కుడు, అ!’  చిత్రాల‌తో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ‌.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ’ చిత్రంలో ఓ క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. ఇందులో మెయిన్ హీరోయిన్‌గా ఉత్త‌రాది భామ పూజా హెగ్డే న‌టిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో ఈషా పాత్ర‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది.
అదేమిటంటే.. ఇందులో తార‌క్ మాజీ ప్రేయ‌సిగా ఈషా క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం. త‌న పాత్రకు గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌కు అవ‌కాశ‌ముంద‌ని.. తార‌క్ నుంచి న‌ట‌న ప‌రంగా చాలా విష‌యాలు నేర్చుకున్నాన‌ని ఈషా చెప్పుకొచ్చారు. తొలిసారి ఓ భారీ బ‌డ్జెట్ చిత్రంలో భాగ‌మైన ఈషాకు.. ఈ సినిమా ఏ మేర‌కు ప్ల‌స్ అవుతుందో చూడాలి.
అక్టోబ‌ర్ 10న విజ‌య ద‌శ‌మి కానుక‌గా ‘అర‌వింద స‌మేత‌..’ విడుద‌ల కానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here