కెరీర్‌లోనే తొలిసారిగా రెండు విభిన్న పాత్ర‌ల్లో అల్లు అర్జున్‌?

Allu Arjun Dual Role In Vikram Kumar Film, First Time Allu Arjun In A Dual Role, Allu Arjun to play dual roles?, Vikram Kumar and Allu Arjun Movie Update, Telugu FilmNagar, Tollywood Latest Updates, Telugu Cinema News, Allu Arjun Upcoming Movie News
Allu Arjun Dual Role In Vikram Kumar Film
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఒక్క పాత్ర‌లో క‌నిపిస్తేనే అభిమానుల‌కు పండ‌గ‌. ఇక‌.. రెండు విభిన్న పాత్ర‌ల్లో సంద‌డి చేస్తే.. బ‌న్ని ఫ్యాన్స్ సంబ‌రానికి ఆకాశ‌మే హ‌ద్దు. క‌థానాయ‌కుడిగా త‌న 15 ఏళ్ళ ప్ర‌స్థానంలో ఇప్ప‌టివ‌ర‌కు ద్విపాత్రాభిన‌యం చేయ‌ని బ‌న్ని.. తొలి సారిగా ఆ ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నార‌ని స‌మాచారం.
ఆ వివ‌రాల్లోకి వెళితే.. అల్లు అర్జున్ క‌థానాయ‌కుడుగా డిఫ‌రెంట్ చిత్రాల ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. దాదాపు రూ.100 కోట్ల బ‌డ్జెట్‌తో న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, శానం నాగ అశోక్ కుమార్ సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ సినిమాలో.. బ‌న్ని రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here