15సంవత్సరాల తరువాత హిందీ సినిమాలో నాగార్జున

Nagarjuna Back To Bollywood After 15 Years,Telugu Cinema Updates,Telugu Filmnagar,Telugu Movie News,Akkineni Nagarjuna Returns to Bollywood After 15 Years,Nagarjuna Joins in Brahmastra,Nagarjuna Key Role in Brahmastra,Brahmastra Movie Latest News,Nagarjuna Upcoming Movie in Bollywood
Nagarjuna Back To Bollywood After 15 Years

ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మాతగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం లో సూపర్ ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ రూపుదిద్దు కుంటుంది. బ్రహ్మాస్త్ర హిందీ సినిమాలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్,రణబీర్ కపూర్,అలియా భట్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.కింగ్ నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్ర లో నటించనున్నారు. బ్రహ్మాస్త్ర సినిమా ఫస్ట్ షెడ్యూల్ బల్గేరియా లో జరిగింది. రెండవ షెడ్యూల్ బల్గేరియా,లండన్ లలో జరుగనుందని సమాచారం.

హీరో నాగార్జున కు హిందీ సినిమాలు కొత్త కాదు, 25సంవత్సరాల క్రితం శివ సినిమాతో హిందీ చిత్రరంగానికి పరిచయమయ్యారు. ఖుదా గవా,జఖం,క్రిమినల్ వంటి హిందీ సినిమాలలో నటించారు. 2003 సంవత్సరం లో నాగార్జున నటించిన ఆఖరి సినిమా LOC కార్గిల్. ఆ సినిమా విజయం సాధించింది. 15సంవత్సరాల తరువాత బ్రహ్మాస్త్ర హిందీ సినిమాలో నాగార్జున నటించడం విశేషం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here