మొత్తానికి వెంక‌టేష్ మొద‌లుపెట్టేశారు

F2 movie, F2 Movie Shooting Schedule, Fun and Frustration, Latest Tollywood Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Venkatesh and Varun Tej F2, Venkatesh joins F2 Movie Shooting, Venkatesh Upcoming Movies, Venky joins F2 shoot, victory venkatesh and varun tej’s multi starer
Venkatesh joins F2 Movie Shooting

మ‌ల్టీస్టార‌ర్ మూవీస్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌లా నిలిచిన సీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్‌. ‘సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, మ‌సాలా, గోపాల గోపాల’ వంటి చిత్రాల్లో మ‌రో క‌థానాయ‌కుడితో సంద‌డి చేసిన వెంకీ.. ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్‌తో ‘ఎఫ్‌2’ (ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌) అనే మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. వ‌రుణ్ తేజ్ త‌దిత‌రుల‌పై హైద‌రాబాద్‌లోని బోర‌బండ ఏరియాకు చెందిన విజేత థియేట‌ర్‌లో కొన్ని కీల‌క‌ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. కాగా.. ఈ రోజు (సోమ‌వారం) నుంచి వెంకీ కూడా ఈ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.

ఈ విష‌యాన్ని చిత్ర ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో తెలియ‌జేశారు. ”మ‌రో ఎగ్జైటింగ్ డే. విక్ట‌రీ వెంక‌టేష్ గారు ఈ రోజు ‘ఎఫ్ 2’ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఎనీటైమ్ ఎనీ సెంట‌ర్‌.. గ‌ణేష్‌.. మ‌న వెంక‌టేష్..గారు” అంటూ అనిల్ ట్వీట్ చేశారు.

త‌మ‌న్నా, మెహ‌రీన్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి తెర‌పైకి రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here