అంతకుమించి ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. సుకుమార్‌

#AnthakuMinchi, Anthaku Minchi Movie, Anthaku Minchi Trailer, Latest Film News, Rashmi Gautam Anthaku Minchi Telugu Movie, Rashmi Gautam Anthaku Minchi Trailer, Sukumar about Anthaku Minchi, Sukumar Launches Rashmi Gautam’s Anthaku Minchi Trailer, Sukumar Praises Anthaku Minchi Trailer, Telugu Cinema Updates, Telugu Filmnagar
Sukumar Launches Rashmi Gautam's Anthaku Minchi Trailer

జై, రష్మి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అంతకుమించి’. జానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సతీష్‌ గాజుల, ఎ.పద్మనాభరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ట్రైల‌ర్‌ను బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా సుకుమార్ మాట్లాడుతూ ‘‘అంతకుమించి ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అలాగే ఇంప్రెసివ్‌గా ఉంది. సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అనేంతగా నాలో ఆసక్తి రేపింది. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌. సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ ఇదొక హార‌ర్, థ్రిల్లర్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌.  ఇంత‌కుముందు వ‌చ్చిన‌ హారర్‌ చిత్రాలకి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది. సోమ‌వారం సాయంత్రం 5 గంట‌ల‌కు ఈ ట్రైల‌ర్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయ‌నున్నాం’’ అన్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here