యాక్షన్ థ్రిల్లర్‌గా బన్నీ తదుపరి చిత్రం?

Allu Arjun in Vikram Kumars next action thriller?, Allu Arjun to team up with Vikram Kumar, Allu Arjun Upcoming movie News, Allu Arjun Vikram Kumar Movie Story, Allu Arjun Vikram Kumar Movie Update, Latest Tollywood Updates, Stylish Star Allu Arjun in an Action Thriller, Stylish Star Allu Arjun Next an Action Thriller, Telugu Filmnagar, Tollywood Cinema News
Stylish Star Allu Arjun in an Action Thriller

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఇటీవ‌ల‌ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో బ‌న్నీ పోషించిన సూర్య‌ పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి. అయితే.. ఈ చిత్రం విడుదలై రెండు నెలలకు పైనే అయినా..త‌దుప‌రి చిత్రం విష‌యంలో బన్నీ నుంచి ఎలాంటి ప్ర‌క‌టన రాలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఆయన కోసం ఓ యాక్షన్ థ్రిల్లర్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.

ఆ వివరాల్లోకి వెళితే.. ‘ఇష్క్’, ‘మనం’, ‘24’ లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుదిమెరుగులు దిద్దే పనిలో విక్రమ్ ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోయే ఈ చిత్రాన్ని.. గతంలో బన్నీతో ‘రేసుగుర్రం’ లాంటి బ్లాక్ బస్టర్‌ను నిర్మించిన నల్లమలుపు బుజ్జితో కలిసి శానం నాగ అశోక్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు చెబుతున్నారు. అలాగే భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. త్వరలో ఈ మూవీకి సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడి కానున్నాయి.

అంతేగాకుండా.. ఈ సినిమాకు క్లాప్ కొట్టే సమయానికి బన్నీ- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ మూవీ డీటైల్స్‌ను కూడా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here