15 ఏళ్ళు పూర్తిచేసుకున్న సింహాద్రి

#15YearsForSimhadri #15YrsOfIndustryHitSIMHADRI, 15 YEARS FOR SIMHADRI Movie, 15 Years of Simhadri, Jr NTR Simhadri Completes 15 Years, Jr NTR Simhadri Movie, Simhadri, Simhadri Movie Completes 15 Years, Simhadri Telugu Movie, Telugu Cinema Updates, Telugu Filmnagar, Telugu Movie News
Simhadri Movie Completes 15 Years

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌ను మ‌లుపు తిప్పిన చిత్రాల‌లో ‘సింహాద్రి’ ఒక‌టి. ఈ సినిమాలో సింహాద్రి, సింగ‌మ‌లై.. ఇలా రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌ట విశ్వ‌రూపం చూపించారు తార‌క్‌. ‘స్టూడెంట్ నెంబ‌ర్ 1’ వంటి విజయ‌వంత‌మైన త‌రువాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా రికార్డు స్థాయి వ‌సూళ్ళ‌ను రాబ‌ట్టుకోవ‌డ‌మే కాకుండా.. 2003లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. 167 కేంద్రాల‌లో 50 రోజులు.. 150 కేంద్రాల‌లో 100 రోజులు.. 52 కేంద్రాల‌లో 175 రోజులు ప్ర‌ద‌ర్శిత‌మైన ఈ సినిమా.. ఎన్టీఆర్ కెరీర్‌లో మెమ‌ర‌బుల్ మూవీగా నిలిచింది.

భూమిక‌, అంకిత క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ ఓ ప్ర‌త్యేక గీతంలో సంద‌డి చేశారు. నాజ‌ర్‌, సీత‌, కోట శ్రీ‌నివాస‌రావు, బ్ర‌హ్మానందం, భాను చంద‌ర్, ముఖేష్ రుషి, రాహుల్ దేవ్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి ఎం.ఎం.కీర‌వాణి అందించిన పాట‌లు, నేప‌థ్య సంగీతం ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. జూలై 9, 2003న విడుద‌లైన ‘సింహాద్రి’ నేటితో 15 వసంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here