నాన్న‌గారు చెప్పిన మాట‌లు నాకెప్పుడూ గుర్తుంటాయి – రామ్ చ‌ర‌ణ్‌

Latest Tollywood Updates, Mega Power Star Ram Charan Speech At Rangasthalam 100 Days Celebration, Ram charam about Chiru and Pawan, Ram Charan about Sukumar, Ram Charan Emotional Speech at Rangasthalam 100 Days, Ram Charan Speech At Rangasthalam 100 Days Celebration, Rangasthalam, Rangasthalam 100 Days, Rangasthalam 100 Days Celebrations, Telugu Filmnagar, Tollywood Cinema News
Ram Charan Speech At Rangasthalam 100 Days Celebration

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అందాల తార‌ సమంత జంటగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 30న విడుదలై.. చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోయింది. 100 రోజులు జ‌రుపుకుంటున్న‌ సినిమాలు కరువైపోతున్న ఈ రోజుల్లో.. ఈ సినిమా శ‌నివారంతో 100 రోజుల పండుగను పూర్తి చేసుకుంది.

ఈ నేపథ్యంలో.. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన శతదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రామ్ చరణ్ మాట్లాడుతూ.. “ఎలా ప్రారంభించాలో అర్ధం కావడం లేదు. ఈ సినిమా 100 రోజులు ఆడిందంటే.. దాని వెనుక ఎంత కష్టం ఉందో తెలుసు. ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి కారణమైన తొలి వ్యక్తి దర్శకుడు సుకుమార్. ఆయన ఆలోచనల్లోంచి పుట్టిన ఈ కథకి నాతో పాటు, రత్నవేలు, దేవిశ్రీ ప్రసాద్ సహా ఎంతోమంది పని చేశారు. ఆయన ఆలోచనే ఈ శతదినోత్సవ వేడుకకి కారణం. ఆయనకి రుణ పడి ఉంటాను. మంచి కథను నమ్మి నిర్మించిన నా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు. అలాగే.. ఈ సినిమాలో నటించిన సమంతగారికి, అనసూయగారికి, ప్రకాశ్‌ రాజ్‌గారికి, ఆది పినిశెట్టిగారికి, జ‌గ‌ప‌తిబాబుగారికి పేరుపేరునా ధన్యవాదాలు. రత్నవేలు గారితో మళ్ళీ మళ్ళీ పని చేయడం ఆనందంగా ఉంది. అలాగే.. మా డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌ అందరికి చాలా థాంక్స్.

‘ఎదిగేట‌ప్పుడు మ‌న‌తో పాటు ప‌ది మందిని పైకి తీసుకెళ్లాలి. ఎందుకంటే ఒక‌వేళ మ‌నం ప‌డిపోతే.. ఆ ప‌దిమందే మ‌నల్ని కాపాడుతారు’ అని నాన్నగారు చెప్పిన మాటలు నాకెప్పుడూ గుర్తుంటాయి. అలాగే.. ఈ సినిమా వల్ల నాతో పాటు అంద‌రూ విజ‌యాన్ని అందుకున్నారు. అంతా సంతోషంగా ఉన్నారు. ప్ర‌తి సినిమాకు వాళ్లు సంతోషంగా ఉండాలి. ఇండ‌స్ట్రీ ఇలాగే కొన‌సాగాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here